హైదరాబాద్ : 08/08/2020
*సమాజం మారిందని ఎంత సర్థి చెప్పుకున్నా* ఇంకా అక్కడక్కడా ఆడా మగా తేడా వివక్ష కనబడుతూనే ఉంది
అయినా అనుకున్నది సాధించారు.ఐపిఎస్ గా ఎదిగి ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు *కర్నాటకకు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్* మొదటి మహిళా కర్ణాటక అధికారి ఐపిఎస్.. డి. రూపా మౌద్గిల్. కర్నాటక గవర్నమెంట్ హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళా అధికారి రూపా మౌద్గల్. 2000 బ్యాచ్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), రైల్వే బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె త్వరలో 1995 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్ స్థానంలో రాష్ట్ర హోం కార్యదర్శిగా నియమితులవుతారు.
ఈ వార్తను ట్విట్టర్‌లో రూపా పోస్ట్ చేశారు. 'నేను కర్ణాటక ప్రభుత్వ హోం కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను. యాదృచ్ఛికంగా, నేను ఆ పోస్ట్‌లో మొదటి మహిళ అని తెలుసుకున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇది సాధించగలిగాను అని ఆమె పేర్కొన్నారు. '
*ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.శశికల విఐపి చికిత్సకు సంబంధించి, 2017 లో బెంగళూరులోని సెంట్రల్ జైలులో జరిగిన పక్షపాతాన్ని రూప బహిర్గతం చేశారు. శశికళ జైలులో ప్రత్యేక చికిత్స పొందారని రూపా ఆరోపించారు*
*20 సంవత్సరాలలో 41 సార్లు బదిలీ చేయబడిన రూప, తాను మొదట అధికారినని, తరువాత ఒక మహిళ అని ఎప్పుడూ నమ్ముతాను అంటారు*
రాజకీయ నాయకులు, సీనియర్ ఐపిఎస్ అధికారులతో సంబంధం ఉన్న కేసులను టేకప్ చేయడానికి రూప ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. *2017 లో, ఆమెకు రాష్ట్రపతి మెడల్ లభించింది.*
*కర్నాటక ప్రభుత్వం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న అవకతవకలను సరి చేయడానికి ఆమె సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు*. ఆమె తన సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రతిఫలంగా 20 సంవత్సరాల సేవలో 41 సార్లు బదిలీ చేయబడటానికి దారితీసింది, *కాని ఆమె నిరంతరం పోరాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు*. ఓ మంచి ఐపిఎస్ అధికారిగా, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తప్పుని తప్పు అని చెప్పే తెగువను, ధైర్యాన్ని మహిళలు అలవరచుకోవాలని చెబుతుంటారు.
Source : @Tv5
*ప్రజా సంకల్పం & link Media రూపా మౌద్గల్ IPS మేడం గారికి సెల్యూట్ చేస్తుంది*
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment