హైదరాబాద్ : 15/08/2020
*1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి దేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విడిపించారు.*
*ప్రజా సంకల్పం మరియు link Media కూడా ప్రజా సమస్యల మీద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా, ఎవరి మనోభావాలను అడ్డుకోకుండా,ఏవరో ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా ఎక్కువ మంది ప్రజల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వాన్ని, అధికారులను,ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను ఆశ్రయించి సమస్యల పరిష్కారమార్గం వైపు వెళుతుంది*
అందులో భాగంగానే *ప్రభుత్వభూములను,చెరువులను,బస్తీ దవాఖాన విషయంలో వాస్తవాలు సేకరించి ప్రభుత్వానికి, అధికారులకు,ప్రజా ప్రతినిధులకు భారత రాజ్యాంగసృష్టికర్త లో ముఖ్యులు గౌరవనీయులైన భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సర్ గారు న్యాయంగా మనకు కల్పించిన హక్కుల ఆధారంగా అన్ని వివరాలతో వినతి పత్రాలు ఇచ్చిన కూడా వాటికి సమాధానం ఇవ్వకుండా వారు ఇష్టం వచ్చినట్లు నడుచుకోవడం రాజ్యాంగంకు విరుద్ధం అవుతుంది అని దయచేసి తెలుసుకోవాలి.ఇలాంటి చర్యలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.లేదు అంటే న్యాయస్థానాలు వున్నాయి అది మరిచిపొవద్దు.*
*నిన్నటి రోజు 14/08/2020 న మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ శారదా నగర్ లో బస్తీ దవాఖానను ప్రారంభించడం మీద ప్రభుత్వం,అధికారులు,ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు జవాబు చెప్పాలి. మేము బస్తీ దవాఖానలకు వ్యతిరేకం కాదు కానీ అవసరం వున్న చోటు కాకుండా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని మొదటనుంచి వాస్తవాలతో మీ అందరి ద్రుష్టికి తీసుకొచ్చినా కూడా మా వినతి పత్రాలను న్యాయంగా విచారణ చేయకుండా వినతి పత్రం ఇచ్చిన వారికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రక్కన పడేసారు.ఇది న్యాయం కాదు. దానికి న్యాయస్థానంలో న్యాయంగా పోరాటం చేయడానికి వెనుకాడేది లేదు.న్యాయస్థానం మీద నమ్మకం వుంది. ఇప్పుడు ఇలానే మనకెందుకులే అనుకుంటే ప్రజా ప్రయోజనాలు ఈ ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు వారు చెప్పిందే శాసనం లాగా అవుతుంది. ప్రజలారా మేలుకోండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఇలాంటి వ్యవస్థ ను మార్చాల్సిన అవసరం ఎంతైనా వుంది 👍*
*ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి దయచేసి మీ ద్రుష్టికి వచ్చిన వినతి పత్రాన్ని చదివి అది రాజ్యాంగ పరిధిలో వస్తుందా లేదా విరుద్ధంగా వుందా అని న్యాయంగా విచారణ చేసి జవాబు ఇవ్వాలి. అదే జవాబు తారీ తనం అంటారు.మనము ప్రజాస్వామ్యదేశంలో వున్నాము నియంత పాలనలో లేము 🙏*
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment