(SOURCE)
Thursday, July 3, 2025
#GHMC సర్కిల్ -18లో కోట్ల రూపాయల అవినీతిలో ఎవరెవరికి భాగస్వామ్యం?
జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ 18 రోడ్ నెంబర్ 9 ప్లాట్ నెంబర్ 75 ఆంధ్రప్రభ దినపత్రిక భవనం ఎదురుగా అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవనం ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ యజమానిది దీనికి సెల్లార్ పర్మిషన్ లేదు జిహెచ్ఎంసి నుండి రెసిడెన్షియల్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని పూర్తి భవనాన్ని అప్రూవ్డ్ ప్లాన్ కి విరుద్ధంగా నిర్మిస్తూ జిహెచ్ఎంసి నిబంధనలను తుంగలో తొక్కుతూ కమర్షియల్ బిల్డింగ్ గా మారుస్తున్నారు . దీంట్లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణం విషయంలో టౌన్ ప్లానింగ్ ఏసిపి ఇంజ శ్రీనివాస్ నాలుగు లక్షల రూపాయలు నాగరాజు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర లంచం రూపంలో తీసుకున్నాడు ఇదే అక్రమ నిర్మాణం విషయంలో అదే నాగరాజు నుండి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏసీపి ఆదేశాల మేరకు నెల రోజుల తర్వాత సెపరేట్ గా మాట్లాడుకుని 13 లక్షల రూపాయలను పంజాగుట్ట చట్నీస్ రెస్టారెంట్లో మధ్యాహ్నం లంచ్ టైంలో లంచం రూపంలో తీసుకున్నాడు సెక్షన్ ఆఫీసర్ సుధాకర్.... ఏసీబీ అధికారులు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సిసి టీవీ ఫుటేజ్ లను పంజాగుట్ట చట్నీస్ రెస్టారెంట్ లో ఉన్న సిసిటివి ఫుటేజ్ లను క్లుప్తంగా పరిశీలిస్తే వీళ్లిద్దరి వ్యవహారం బహిరంగంగా బయటపడుతుంది ఏసీపీ ఇంజ శ్రీనివాస్ మూడు నెలల ముందు ఈ డబ్బులు తీసుకున్నాడు సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ రెండు నెలల ముందు ఈ డబ్బులు తీసుకున్నాడు. ఇలా అక్రమ నిర్మాణదారుడు 17 లక్షల రూపాయలు లంచం సమర్పించుకోవడానికి ప్రధాన కారణం ఆ రోడ్లో కమర్షియల్ పర్మిషన్ అప్లై చేసుకున్నా కూడా జిహెచ్ఎంసి నుండి పర్మిషన్ రాదు ఎందుకంటే అది రెసిడెన్షియల్ జోన్ లో ఉంది. ఇలా అక్రమ నిర్మాణదారుల బొక్కలను తమ జేబులు నింపుకోవడానికి ఉపయోగించుకుంటూ జిహెచ్ఎంసి సర్కిల్ 18 ఏసిపి ఇంజ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు గత పది నెలలుగా చాలామంది నుండి కోట్ల అక్రమ సంపాదనను పోగేసుకున్నారు వీళ్ళు చేసిన అన్ని అవినీతి అక్రమాలకు ఏసీబీ అధికారులు క్లుప్తంగా ఎంక్వయిరీ జరిపిస్తే అన్ని నిజానిజాలు బయటికి వస్తాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment