చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో మొదలైన బోనాల ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి, పర్యవేక్షణతో నెల రోజుల పాటు జరిగిన బోనాల ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అన్నారు. ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుందన్నారు. తెలంగాణ సాంప్రదాయానికి అద్దంపట్టే బోనాల జాతరతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మకత ఉట్టిపడిందన్నారు.
గోల్కొండలో మొదటి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల ఘటం ముగుస్తుందన్నారు.
బోనాల ఉత్సవాలు విజయంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
Bplkm✍️
No comments:
Post a Comment