తేదీ : 17.07.2025
శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు,
అనుముల రేవంత్ రెడ్డి గారికి వినమ్రంగా నమస్కరించి వ్రాయునది.
విషయం:
నల్లగొండ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం వల్ల, నాకు జరుగుతున్న అన్యాయంపై చర్యలు తీసుకోవడం కొరకు విజ్ఞప్తి.
సార్,
నేను కళ్లెం పరమేష్, తండ్రి పేరు రామచంద్రం, వయసు 40 సంవత్సరాలు, బడుగు వర్గానికి చెందిన ఎస్సీ (బుడగ జంగాలు) కులానికి చెందినవాడిని. నా నివాసం బండమీది గూడెం గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా.
నేను శాలిగౌరారం మండలం, పేర్క కొండారం గ్రామ శివారులో సర్వే నం. 629లో 1 ఎకరం 27 గుంటల భూమిని 2016లో వల్కి రత్నం అనే వ్యక్తి నుండి సదా బైనామా ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. కాని అతనికీ భూమిపై పట్టా లేకపోవడం వలన నాకు ఇప్పటివరకు పట్టా ఇవ్వలేదు. అయినా, నేను కొనుగోలు చేసిన రోజునుంచి ఇప్పటి వరకు కబ్జాలోనే ఉన్నాను.
మా ఇంటికి పక్కన నివసిస్తున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్ గారిని సంప్రదించగా, నాకు పట్టా ఇప్పిస్తానని చెప్పి ₹1,50,000/- రూపాయలు తీసుకున్నారు. కానీ పట్టా ఇప్పించకుండా, భయభ్రాంతులకు గురిచేసి, “ఈ భూమికి పట్టా లేదు” అంటూ నమ్మించి, దాన్ని అమ్మేస్తానని చెప్పి తార్డ్ పర్సన్ వద్ద నుండి వైవాటి పట్టాలను తీసి తన అనుచరుని పేరుమీద పట్టా చేయించినాడు అయితే 50 లక్షల విలువ గల భూమిని వేరే వ్యక్తులకు అమ్మి నాకు 4 లక్షలు మాత్రమే ఇచ్చినాడు నా భూమిని బలవంతంగా కబ్జా చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు.
ఈ ఘటనలపై నేను క్రింది తేదీలలో నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, ఆర్డీవో మరియు శాలిగౌరారం, ఎమ్మార్వో, ఎస్సై గార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసాను:
ఈ తేదీ లో 28.11.2022, 19.01.2023, 12.08.2023, 19.09.2023, 30.09.2024, 06.02.2025, 01.07.2025.
కానీ నా ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరిపించకపోవడమేగాక, నాకు విద్య లేకపోవడం, రాజకీయ పరంగా అండ లేకపోవడం, ఎస్సీ వర్గానికి చెందిన నిరుపేదనని చూపి నా సమస్యను నిర్లక్ష్యం చేశారు.
నేను ఫిర్యాదు చేసిన వ్యక్తి అన్నెబోయిన సుధాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజకీయ ప్రాబల్యం ఉపయోగించుకుంటూ, ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గార్ల సహకారంతోనే చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, నాకు జరిగిన అన్యాయంపై గౌరవ ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో స్పందించి,
• నల్లగొండ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలి.
• అన్నబోయిన సుధాకర్ గారి పై విచారణ జరిపి, న్యాయమైన చర్యలు తీసుకోవాలి.
• నా భూమికి తగిన పట్టా చేయించి, పాసుబుక్ మంజూరు చేయించాలి.
• నాకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారం కల్పించాలి.
• గత ప్రభుత్వం హయాంలో తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారి సహకారతో ఎస్సీ ఎస్టీ కేసుని విచారణకు రాకుండానే కొట్టివేయించినారు కేసు fir నెంబర్ 118/2023, తేదీ: 15.07.2023.
ఈ వేడుకోలుపై స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ఇట్లు,
తమ వీదేయుడు ,
కళ్లెం పరమేష్,
తండ్రి పేరు: రామచంద్రం,
గ్రామం: బండమీది గూడెం,
మండలం: శాలిగౌరారం,
జిల్లా: నల్లగొండ,
ఫోన్ నెంబర్ : 9951497821.
No comments:
Post a Comment