*తెలంగాణలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దూకుడు.............* అంటూ పత్రిక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో దొరికిన వాళ్ళ సంగతి సరే దొరకకుండా దోచుకుంటున్న అవినీతి ప్రభుత్వ అధికారుల విషయం ఏసీబీ నిఘ ఎందుకు కరువైంది.తెలంగాణ ప్రజల దృష్టిలో అత్యంత విశ్వసనీయ సంస్థ ఏదైనా ఉంటే అది ఏసీబీ ఒక్కటి మాత్రమే ఏసీబీలో కంప్లైంట్ చేశామా 100% మాకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు బాగా నమ్ముతారు. అలాంటిది తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలపై ఉక్కు పాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇలాగా జూబ్లీహిల్స్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల జాతర పై సరైన సమాచారం లేకపోవడం విడ్డూరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఏసీబీ హెడ్ ఆఫీస్ రాష్ట్ర లోని మొత్తం యంత్రాంగం జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 లోనే స్థిరపడి ఉంది. వీఐపీలు వివిఐపీలు వ్యాపార దిగ్గజాలు ఇలా రాష్ట్రంలోని పేరుగాంచిన వ్యక్తులందరికీ స్థిర నివాసాలు జూబ్లీహిల్స్ సర్కిల్ -18 లోనే ఉంటాయి. ఇలాంటి ఇంత ఖరీదైన ప్రాంతంలో జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 టౌన్ ప్లానింగ్ ఏసిపి ఇంజా శ్రీనివాస్ మొన్నటి వరకు పనిచేసినటువంటి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏసీబీ కళ్ళకు గంతలు కట్టి చేస్తున్న అవినీతి అక్రమాలను వెలుగు తీయకపోవడం ఏసీబీ వైఫల్యం కాదా!? జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 126 అవినీతి కేసులను నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి నిరోధక శాఖ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లలో అక్రమ నిర్మాణాల మాటున జరుగుతున్న అవినీతి దందా తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అలా అని అవినీతి నిరోధక శాఖ మీద మాకు ఎలాంటి సందేహం లేదు ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్లు రాష్ట్ర మొత్తంలో అన్ని శాఖలపై అవినీతి నిర్మూలన అనే అంశంతో ఒక ఆధిపత్యం ఏర్పాటు చేసుకోగలిగిన ఏసీబీకి జూబ్లీహిల్స్ టౌన్ ప్లానింగ్ సర్కిల్ -18 లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగు తీయడం పెద్ద పనేమీ కాదు, కాకపోతే ఇప్పటివరకు వాళ్ల హడావుడిలో జిహెచ్ఎంసి సర్కిల్ -18 నీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఇప్పటికైనా *ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్* గారు త్వరితగతిన స్పందించి జిహెచ్ఎంసి సర్కిల్ -18 లో బిల్డింగ్ పర్మిషన్ల లో, ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లలో, అక్రమ నిర్మాణాల విషయంలో జరుగుతున్న అంతులేని అవినీతిని ఉక్కు పాదంతో తొక్కిపెట్టే విధంగా చర్యలు తీసుకొని నియంతల వ్యవహరిస్తున్న సర్కిల్ -18 ఏసిపి ఇంజ శ్రీనివాస్ మొన్నటి వరకి ఏసీబీకి అక్రమ వాసులలో మధ్యవర్తిగా వ్యవహరించిన సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ పై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి గత పది నెలలుగా జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై శాఖపరమైన ఎంక్వయిరీ జరిపించి నిజా నిజాలను తెలంగాణ సమాజం ముందు పెట్టగలరని అని అభ్యర్థిస్తున్నాము. జిహెచ్ఎంసి చట్టాలను తుంగలో తొక్కుతూ *జిహెచ్ఎంసి రూల్ బుక్* ప్రకారం వ్యవహరించకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణదారులు ఇచ్చే లంచాలను పరమావధిగా భావిస్తూ వారికి సలహాదారులుగా మారిన ఏసిపి ఇంజ శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ సుధాకర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, టౌన్ ప్లానింగ్ చీఫ్ సిటీ ప్లానర్ కే. శ్రీనివాస్, అడిషనల్ సిసిపి వెంకన్న, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సిటీ ప్లానర్ సాంబయ్య, డిప్యూటీ కమిషనర్ సర్కిల్ -18 సమ్మయ్య ఇలా అందరూ ఉన్నతాధికారులు కూడా ఏసీబీకి సహకరించే విధంగా శాఖాపరమైన ఎంక్వయిరీ చేయించి, నిజా నిజాలను వెలుగులోకి తీసుకువచ్చి అవినీతి నిరోధక శాఖ అధికారులకు తమ వంతు సహాయం చేయవలసిందిగా తద్వారా టౌన్ ప్లానింగ్ లో అవినీతికి చోటు లేదు అనే సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వవలసిందిగా అంతేకాకుండా వెంటనే సర్కిల్ -18 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల పట్ల ఏసీపి ఇంజ శ్రీనివాస్ కు వెంటనే మెమోలు జారీ చేసి శాఖపరమైన ఎంక్వయిరీ ని కూడా జరిపించి అన్ని అక్రమ నిర్మాణాలలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి జిహెచ్ఎంసి పరువును మూసీలో కలవకుండా ప్రయత్నం చేయగలరని మా మనవి.
*ముఖ్య గమనిక*: మీరు నిజాయితీ పరులు అయితే ఈ పోస్టుని తెలంగాణ లోని అన్ని వాట్సప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి మీరు అవినీతిపరులు అయితే ఈ పోస్టుని వాట్సప్ గ్రూపులలో నుండి డిలీట్ చేయండి. అవినీతి అంతం అదే మా పంతం అనుకునే నిజాయితీగల తెలంగాణ బిడ్డలు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సర్కిల్ -18 జూబ్లీహిల్స్ లో అక్రమ నిర్మాణాల మాటున జరుగుతున్న కోట్ల అవినీతి బాగోతాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకు వెళ్లడానికి మీ వంతు సహకారాన్ని అందించండి. అవినీతి లేని సమాజాన్ని చూడాలన్న ముఖ్యమంత్రి కలను నెరవేర్చడానికి సాధ్యమైనంత వరకు ఈ పోస్టుని అన్ని వాట్సాప్ గ్రూప్ లలో సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఫార్వర్డ్ చేయండి.🙏
ముందుగా ఏసీబీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను ఒకసారి గమనించగలరు. తదనంతరం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సర్కిల్ -18 జూబ్లీహిల్స్ అధికారుల అక్రమ వసుల దండ గురించి వివరనాత్మకమైన కథనాన్ని చదవగలరు.
*ఆరునెలల్లో రూ.కోట్ల కొద్దీ అక్రమాస్తుల స్వాధీనం*
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB) దూకుడు పెంచింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో 126 అవినీతి కేసులను నమోదు చేసింది.
ఈ కేసుల్లో 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఈ కాలంలో రూ.27.66 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. లంచాలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతూ 80 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వివిధ శాఖల నుంచి రూ.24.57 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూన్ నెలలోనే రూ.3.43 లక్షలు సీజ్ చేశారు.
మరొకవైపు ఆర్టీఏ చెక్‌పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీల్లో రూ.2.72 లక్షల అక్రమ నగదు స్వాధీనం చేశారు. 8 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.13.50 లక్షలు స్వాధీనం చేసుకోగా, మరో రూ.5.22 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇవే కాకుండా అదనంగా, 14 క్రిమినల్ మిస్కండక్ట్ కేసులు,10 రెగ్యులర్ ఎంక్వైరీలు,11 ఆకస్మిక తనిఖీలు,3 డిస్క్రీట్ ఎంక్వైరీలు నమోదయ్యాయి. ఒక్క జూన్‌లోనే 31 కేసులు నమోదు కాగా అందులో 15 ట్రాప్ కేసులు,2 ఆస్తుల కేసులు, 3 మిస్కండక్ట్ కేసులు నమోదయ్యాయి.గడిచిన ఆరు నెలల్లో 129 కేసులను ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపగా, జూన్‌లో 11 కేసులు ఫైనలైజ్ అయ్యాయి. ఈ మేరకు ఏసీబీ వివరాలు విడుదల చేసింది.
ఏసీబీ గత జనవరి నుండి జూన్ వరకు 2025 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలలుగా తెలంగాణలోని అవినీతి అధికారులపై పెట్టిన అన్ని కేసుల వివరాలు అంతేకాకుండా పట్టుకున్న అక్రమ సంపాదన గురించి అంతేకాకుండా గత ఆరు నెలలుగా పూర్తిస్థాయిలో చేసిన దాడుల వివరాలను అన్నిటిని అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు పత్రికలకు విడుదల చేయడం చాలా సంతోషం రాసుకోవడానికి పత్రికలలో చెప్పుకోవడానికి తెలంగాణ సమాజంలో ఎంతో కొంత సంతోషం ఉన్నప్పటికీ అసలైన అవినీతి అధికారులు ఇంకా చాలామంది బాహ్య ప్రపంచంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.ఎన్ని ఏసీబీ దాడులు జరిగిన అక్రమ సంపాదనే ధ్యేయంగా తమ పని తాము చేసుకుంటూ ఏసీబీకి భయపడేది లేదు అన్నట్లు వ్యవహరిస్తూ కోట్ల అవినీతి అక్రమ సంపాదనను వెనకేసుకుంటూ తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా పిలుస్తూ తమ అక్రమ సంపాదనను పెంచుకుంటూ మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు మా పని మేము చేసుకుంటాం మీ పని మీరు చేసుకోండి మహా అయితే ఏసీబీ వాళ్ళు కేసులు పెడతారు నెల రోజుల్లో బెల్ తెచ్చుకొని బయటికి వస్తాం కేసులు సంవత్సరాలపాటు కొనసాగుతూనే ఉంటాయి. మేం మాత్రం సంపాదించుకున్న అక్రమ సంపాదనతో ఎంజాయ్ చేయడమే కాకుండా సస్పెన్షన్ కి గురైన సంవత్సరంలో మళ్ళీ పోస్టు తెచ్చుకుంటాం లంచమిచ్చి..... లంచాలు ఇచ్చి పోస్టు తెచ్చుకున్నాం కాబట్టి మళ్లీ లంచాలకు ఎగబడతాం తెలంగాణ ప్రజల రక్తాన్ని అక్రమ సంపాదన రూపేనా పీల్చుకు తింటూనే ఉంటాం అన్నట్లు తయారైంది. ప్రభుత్వంలోని కొందరి అవినీతి అధికారుల తీరు. ఇప్పటికీ ప్రభుత్వ శాఖలలో చాలామంది నిజాయితీగల అధికారులు పనిచేస్తున్నప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల వల్ల మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులందరూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై యుద్ధం అని ప్రకటించగలిగితే చాలా బాగుంటుంది. నిజాయితీగల ప్రభుత్వ అధికారులందరూ ఏసీబీకి సంపూర్ణంగా సహకరిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారి ఏ స్థాయిలో ఉన్న త్వరితగతిన ప్రతి సమాచారాన్ని ఏసీబీకి అందజేసి కరప్షన్ లేని తెలంగాణని చూడడానికి తమ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను. ఏసీబీ దూకుడు పెంచడం అవినీతి నిర్మూలన కోసం అంతులేని పోరాటం చేయడం చాలా సంతోషం కానీ అవినీతిని తారాస్థాయికి తీసుకుపోయిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లోని ఈ ఇద్దరు అధికారులను మాత్రం ఏసీబీ ఎందుకు పట్టుకోలేక పోతుంది. ఏసీబీ వద్ద సరైన సమాచారం లేకపోవడం వల్లన లేక ఏసీబీ అధికారులకు వీళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలు విషయంలో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం ఏసీబీ లోని కిందిస్థాయి నిఘా వ్యవస్థ వీళ్ల అవినీతి అక్రమాల గురించి అక్రమ సంపాదన గురించి అక్రమ నిర్మాణదారుల వద్ద వసూలు చేస్తున్న లంచాల గురించి సరైన సమయంలో సరైన సమాచారాన్ని అందించకపోవడం వలన, అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏసీబీ లోని కిందిస్థాయి నిఘా వ్యవస్థకు చిక్కకుండా చాలా పకడ్బందీగా అత్యంత గోప్యంగా వీళ్ళిద్దరూ అవినీతికి పాల్పడుతూ గత పది నెలలుగా తెలిసి తెలియకుండానే ఏసీబీ అధికారులకు పెద్ద సవాలు విసురుతున్నట్లే అనిపిస్తుంది. వీళ్లిద్దరి వ్యవహారం గత పది నెలలుగా జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 లో కోట్ల అవినీతి జరిగింది. వీరిద్దరి హయాంలో వీళ్ళని తోడు దొంగలు అని అనలేం అవినీతి అధికారులు అని కూడా అనలేం అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు అని కూడా అనలేము లంచగొండి అధికారులు అని కూడా అనలేం, ఎందుకంటే ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునే అధికారులకు కొదవలేదు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులలో వీళ్ళు ఇంత బహిరంగంగా లంచాలు తీసుకుంటూ అక్రమ సంపాదనకు పునాదులు వేసుకుంటూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారంటే ఇది ముమ్మాటికి ఏసీబీ వైఫల్యమే!? వీళ్లు లంచాలు తీసుకోవడం మానరు వీళ్లు లంచాలు తీసుకుంటూనే ఉంటారు.వీళ్లను పట్టుకునె నాదుడే దిక్కు లేనప్పుడు వీళ్ళు లంచాలను ఎందుకు వదిలేసుకుంటారు. ప్రభుత్వ జీతం కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా లంచం రూపంలో వస్తుంది. కాబట్టి ఏసీబీ తన పనిలో తాను బిజీగా ఉంది. కాబట్టి వీళ్ళు లంచాలకు అలవాటు పడ్డారు. వీళ్ళని తప్పు పట్టడానికి ఏమీ లేదు ఇది ముమ్మాటికి ఏసీబీ వైఫల్యమే ఏసీబీ కిందిస్థాయి నిఘ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ ఇద్దరు అధికారులు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఇద్దరి అవినీతి అధికారులకు సహకరిస్తున్న ఆ ఉన్నత అధికారి ఎవరు అనేది త్వరలో మీ ముందుకు వస్తుంది. గత పది నెలలుగా వీళ్లు ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు అన్నిటిని ఏసీబీ దర్యాప్తు చేయడం ప్రారంభిస్తే ఆక్యుపెన్సి సర్టిఫికెట్లలో జరిగిన అక్రమాల పట్ల ఏసీబీ పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే గత పది నెలలుగా జూబ్లీహిల్స్ సర్కిల్ - 18 ఎన్ని అక్రమ నిర్మాణాలను వీళ్ళు పెంచి పోషించారన్న విషయంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారిస్తే వీళ్లు సంపాదించిన కోట్ల అక్రమ సంపాదన గురించి తెలంగాణ ప్రజలకి, జిహెచ్ఎంసి లోని అందరూ ఉన్నతాధికారులందరికీ బాహాటంగానే నిజా నిజాలు తెలుస్తాయి. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సర్కిల్ -18 పై నిఘా పెంచి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజ శ్రీనివాస్ అవినీతి అక్రమాలను వెలికి తీయాలని స్థానిక ప్రజలు, నిపుణులు, మేధావులు కోరుకుంటున్నారు. ఏసీబీ విడుదల చేసిన ఈ పత్రిక ప్రకటన మరియు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అంతా నిజమే ఉంది. కానీ వీళ్లందరినీ మించిన అసలు దొంగలు ఇంకా బాహ్య ప్రపంచంలోనే హాయిగా తిరుగుతూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరో కాదు ( 1 ) జిహెచ్ఎంసి జూబ్లీహిల్స్ సర్కిల్ -18 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజ శ్రీనివాస్ ( 2) ప్రస్తుత టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ చంద్రాయన గుట్ట Ex చంచల సుధాకర్ వారం రోజుల క్రిందటి వరకు సెక్షన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ సర్కిల్ గా విధులు నిర్వహించిన వీరిద్దరి అక్రమ సంపాదన ముందు ఏసీబీ ఇప్పటివరకు పట్టుకున్న వీళ్ళందరూ బలాదూర్ ఒక సంవత్సరంలో యాంటీ కరప్షన్ బ్యూరో 100 మందిని పట్టుకోవడం ఒక ఎత్తు ఇంజా శ్రీనివాస్,చంచల సుధాకర్ లను పట్టుకోవడం మరో ఎత్తు అన్నట్లు అవుతుంది. ఏసీబీకి వీళ్ళిద్దరి వ్యవహారం
జిహెచ్ఎంసి సర్కిల్ -18 లో వీళ్ళిద్దరూ కలిసి అక్రమ నిర్మాణదారుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన సొమ్ము కోట్ల లోనే ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని భవనాల ఫోటోలు లైవ్ లొకేషన్ లో మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాం. అన్ని రకాల ఎంక్వయిరీలు సీసీ ఫుటేజ్ లను కరెక్ట్ గా పరీక్షిస్తే ఇద్దరు అవినీతి అధికారుల బాగోతం ఉత్తగానే బయటపడుతుంది.
(SOURCE)
No comments:
Post a Comment