(SOURCE)
Thursday, July 3, 2025
#GHMC సర్కిల్-18లో అవినీతి కి అండగా పెద్దమనుషులు?
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కిమిటి ఎంక్లేవ్ ఎదురుగా ప్రధాన రహదారి మీద గతంలో కొన్ని సంవత్సరాల ముందు నుండి ప్రైడ్ హోండా కి సంబంధించిన ఒక పాత షెడ్డు ఉండేది ఆ షెడ్ కి కూడా జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేవు ఆ షెడ్ కి ప్రాపర్టీ టాక్స్ మాత్రం కట్టేవాళ్ళు గతంలో. 9 నెలల ముందు ఆ షెడ్ ని పూర్తిగా నేలమట్టం చేసి పక్కా భవనాన్ని నిర్మిద్దాం అనుకున్నారు ఆ పాత షెడ్డు ని పూర్తిగా తొలగించిన అనంతరం బిల్డింగ్ పర్మిషన్ కోసం ప్రయత్నం చేయగా రోడ్ ఎఫెక్ట్ ఏరియా, సెట్ బాక్స్ ఏరియా వదిలితే పెద్దగా ఏమి జాగా మిగలడం లేదు దీంతో ఏసిపి ఇంజ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ల సలహాల మేరకు రేంజ్ రోవర్ షోరూమ్ ని జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే జిహెచ్ఎంసి ఖజానాకి గండి కొడుతూ అక్రమంగా నిర్మించారు ఈ అక్రమ నిర్మాణం పై పత్రికల్లో కథనాలు రావడంతో నోటీసులు జారీ చేసి హియరింగ్ ని కూడా కండక్ట్ చేశారు డి సి చాంబర్లో హియర్ రింగ్ కి రేంజ్ రోవర్ షోరూం ఓనర్ రాకుండా ఒక కాంట్రాక్టర్ ని పంపించాడు కాంట్రాక్టర్ కి తొందర తొందరగా ఓపెనింగ్ చేసుకోండి మీడియా వాళ్ల ప్రెజర్ ఉంది పేపర్లో వార్తలు వస్తున్నాయి స్థానికులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు అంటూ అనధికారికంగా సమాచారం అందించి రాత్రింబవళ్లు అక్రమ నిర్మాణాన్ని పూర్తిచేసే దిశగా అనధికారికంగా చర్యలు తీసుకొని మొత్తానికి వారం రోజుల క్రితం రేంజ్ రోవర్ షోరూమ్ కి గృహప్రవేశం జరిపించారు కాంట్రాక్టర్ దగ్గర నుండి 20 లక్షల రూపాయలను లంచం రూపాన ఏసిపి ఇంజ శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు అందుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఉన్నతాధికారులు నేలమట్టం చేయగలిగితే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి ఉన్నతాధికారులు దొంగలకు తాళం చెవి ఇచ్చినట్టు ఫిర్యాదులు వాళ్లపైనే వస్తున్న కూడా వాళ్ళనే కూల్చమంటే ఎలా కొలుస్తారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణం విషయంలో జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులు అందరూ స్పందించి ఏసీబీ అధికారులకు సహకరించి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఏ సి పి ఇంజా శ్రీనివాస్ తీసుకున్న లంచాన్ని కక్కిస్తే బావుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment