(SOURCE)
Thursday, July 3, 2025
#GHMC సర్కిల్-18లో జోరుగా అవినీతి...కమీషనర్ నిద్దురపోతుండా?
ఏసీబీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ భవన యజమాని నుండి కూడా లంచం వసూలు చేయడం మాత్రం వదలలేదు జిహెచ్ఎంసి సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ ఏసిపి ఇంజ శ్రీనివాస్, పూర్తి వివరాల్లోకి వెళితే ఈ భవనం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అవినీతి నిరోధక శాఖ హెడ్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉంటుంది ఈ భవనం యజమాని పేరు మనోజ్ అగర్వాల్ ఇతను తన పాత భవనం పై రెండున్నర అంతస్తులను జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినందుకు గాను ఎసిబపి ఇంజ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు ఈ యజమానికి నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న భవన యజమాని మనోజ్ అగర్వాల్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ని జూబ్లీహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లో ఏసీపి ఆదేశాల మేరకు కలిశాడు . జిహెచ్ఎంసి కి సంబంధించిన ఒక రిటైర్డ్ టాక్స్ ఇన్స్పెక్టర్ ని ఏసీపి ఇంజా శ్రీనివాస్ వద్దకి పంపించాడు.భావన యజమాని మధ్యవర్తిగా రిటైర్డ్ వచ్చిన టాక్ ఇన్స్పెక్టర్ కుమ్మక్కై ఏసీపీ శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు జిహెచ్ఎంసి లోని తమకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ టాక్స్ ఇన్స్పెక్టర్ను మధ్యవర్తిగా పెట్టుకొని రెండు నెలల ముందు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని మంగత్రాయ్ జువెలరీ షోరూమ్ ఉన్న బిల్డింగ్ లో ఒక జువెలరీ షోరూంలో మధ్యాహ్నం సమయంలో మధ్యవర్తి రిటైర్డ్ టాక్సెస్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ద్వారా 10 లక్షల 50 వేల రూపాయలను లంచం రూపేనా ఏసీపి ఇంజా శ్రీనివాస్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర్లు తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని లుంబిని మాల్ బిల్డింగ్ లో తిబారు మల్ అనే జ్యువలరీ షోరూంలోని సీసీటీవీ ఫుటేజ్ లను తీసుకోగలిగితే మధ్యవర్తిగా వ్యవహరించిన రిటైర్డ్ టాక్ ఇన్స్పెక్టర్ హరినాద్ ని ప్రశ్నిస్తే సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ నీ మధ్యవర్తిగా ఏసీపి పెట్టుకొని సుధాకర్ ద్వారా ఏసీపీ శ్రీనివాస్ 10 లక్షల 50 వేల రూపాయలను లంచం రూపేనా తీసుకున్న పూర్తి వివరాలు బయటికి వస్తాయి తద్వారా ఏసీబీ హెడ్ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉన్న కూడా లంచం మాత్రం వదలం అని ఏసీపీ శ్రీనివాస్ విచ్చలవిడిగా అవినీతి నిరోధక శాఖ అధికారుల కళ్ళకు గంతలు కట్టి దోచుకున్న సొమ్ము మొత్తం బయటికి వస్తుంది తెలంగాణ సమాజానికి జిహెచ్ఎంసి లోని ఉన్నతాధికారులందరికీ నిజా నిజాలు వెలుగులోకి వస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment