ఒక సంక్షేమ పథకం…
అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది…
“కొందరు” ఎగతాళి చేసినా…
ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం…
ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి…
ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి…
ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది.
ఈ ఒక్క పథకం వల్ల…
ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ
35 నుండి 60 శాతానికి పెరిగిందని…
పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య
సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు
వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని…
ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని…
అదే ఆర్టీసీలో పని చేస్తున్న…
ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు…
నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి.
ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి…
ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి…
పేదవాడి ప్రగతి రథ చక్రం
ఇక చరిత్ర పుటల్లోకి…
జారి పోతుందనే పరిస్థితి…
అక్కడ నుండి మొదలైన ప్రయాణం…
నేడు 200 కోట్ల జీరో టికెట్లతో…
ఆడబిడ్డలకు సాయం చేసి…
ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి,
సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు.
సంస్థ యాజమాన్యానికి…
మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు
నా ప్రత్యేక అభినందనలు.
ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా
మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
No comments:
Post a Comment