పత్రిక ప్రకటన
తేదీ:-05-02-2025
విషయం:- *ఈసీఐఎల్ సౌత్ కమలానగర్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో కాప్రా మండల మహాసభ నిర్వహించడం జరిగింది. కాప్రా మండల మహాసభకి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ హాజరయ్యారు.*
*ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ*..... స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే మూడు లక్షాలను సాధించేవరకు ఉద్యమిస్తామని అన్నారు. ఎస్ఎఫ్ఐ 1970 సంవత్సరంలో పూరుడుపోసుకొని విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఛాంపియన్ లగా పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. దేశంలోని ప్రఖ్యాత కలిగి ఉన్న జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఎన్నో యూనివర్సిటీ లలో ఎస్ఎఫ్ఐ విజయ డంక ముగిస్తుందని అన్నారు, దేశానికి ముప్పు లాంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పోరాడుతున్నాము అని తెలియజేశారు. విద్యారంగాన్ని నిర్యిర్యం చేసే కుట్రాలను తిప్పి కొడుతామని హెచ్చరించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ విద్యా విధానంపై అడుగులు వేయాలని విద్యారంగానికి బడ్జెట్ అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై పోరాటాలకు సన్నద్ధం అవుతాము అని అన్నారు. కాప్రా మండలంలో ఉన్న విద్యారంగ సమస్యలపై, ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజు నియంత్రణ చట్టం కై పోరాటం రూప పొందించాలని అన్నారు. కాప్రా మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలు ఏర్పాటుకై పోరాడుతాం అన్నారు.చర్లపల్లి, కాప్రా, నాచారం లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఐటిఐ కళాశాల మొత్తం ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ ఐటిఐ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాప్రా మండల మహాసభ లో కాప్రా మండల నూతన కమిటీ 19 మందితో ఎన్నుకోవడం జరిగింది.
కాప్రా మండల నూతన అధ్యక్షుడు:- శ్యామ్ రావు,
కాప్రా మండల నూతన కార్యదర్శి:- అరుణ్ కుమార్,
కాప్రా మండల నూతన ఉపాధ్యక్షులు:-మనీష్, నిఖిల్, ప్రశాంత్, భాను, రోహిత్, బుజ్జి యాదవ్,
నూతన సహాయ కార్యదర్శులు:-సాయి భార్గవ్, గుణ శ్యామ్, మహేష్, చెర్రీ,
నూతన కమిటీ నంబర్స్:- ప్రశాంత్, బంటి, బి.రోహిత్, ఉదయ్, గౌతమ్, యం.రోహిత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదములతో...
కాప్రా మండల అధ్యక్షుడు శ్యామ్ రావు,
కాప్ర మండల కార్యదర్శి అరుణ్ కుమార్.
No comments:
Post a Comment