Friday, February 14, 2025

సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన పుస్తకం 'విజయ తెలంగాణ'

వేలాది మంది యువకులు, విద్యార్థుల త్యాగాలు, సబ్బండ వర్ణాల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, అలాంటి ఉద్యమ చరిత్రను ఏ కొందరు వ్యక్తులో తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించినప్పుడు, నిజంగా త్యాగాలు చేసిన సిసలైన ఉద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను లిఖించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన పుస్తకం 'విజయ తెలంగాణ' అని, ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

మలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ యోధుడు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ గారు రచించిన 'విజయ తెలంగాణ' పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. హర్యానా గవర్నర్ @Dattatreya గారు, మంత్రి @Ponnam_INC గారు,  రాజ్యసభ సభ్యులు @drlaxmanbjp గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు..

🔷 "వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే  నాయకుల్లో దేవేందర్ గౌడ్ గారు అగ్రస్థానంలో ఉంటారు. విజయ తెలంగాణ వారి స్వీయ చరిత్ర కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం ఇది.  

🔷 ఉద్యమ చరిత్రను కొంత మంది తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రగా లిఖించాలని మరోసారి కోరుతున్నాను.

🔷 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ గారు ఆ నాడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాలు సాహసోపేతమైనవి. గోదావరి జలాల తరలింపు కోసం దేవేందర్ గౌడ్ గారు ఆ నాడు చేసిన పాదయాత్ర ఫలితంగానే 'ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు'కు ఆమోదం లభించింది.

🔷 తెలంగాణ అంటే టీజీ అని రాయించింది దేవేందర్ గౌడ్ గారే. ఉద్యమంలో యువకులు బండ్ల పైనే కాదు, గుండెలపైనా టీజీ అని రాసుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మార్చాం.

🔷 రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయహే తెలంగాణ పాటను అధికారిక గీతంగా గుర్తించడంగానీ, తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఆర్థిక సహాయ ప్రకటన వంటి నిర్ణయాలు ప్రజలు కోరుకున్న విధంగానే తీసుకున్నాం.

🔷 #TullaDevenderGoud గారి లాగా విలువలతో కూడిన నాయకుల సంఖ్య తెలంగాణ రాజకీయాల్లో పెరగాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
#VijayaTelangana #TelanganaRising 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1890426630130266169?t=ADmkoHXMJ3P-409z5GPcYQ&s=19

No comments:

Post a Comment