Thursday, February 20, 2025

*_హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీల‌కం ప్ర‌జల అంచ‌నాలక‌నుగుణంగా ప‌నిచేద్దామ‌న్న క‌మిష‌న‌ర్‌_*

https://youtu.be/Aogw_R3t9g8?si=vCBhjTSDfWcABu9-

*_హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర  కీల‌కం ప్ర‌జల అంచ‌నాలక‌నుగుణంగా ప‌నిచేద్దామ‌న్న క‌మిష‌న‌ర్‌_*

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 20: 

* హైడ్రా నిర్వ‌హిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు అన్నారు. 

* ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు హైడ్రా ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని.. ఈ విష‌యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

* డీఆర్ ఎఫ్‌లోకి  ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్త‌గా తీసుకున్న 357 మంది శిక్ష‌ణ ప్రారంభోత్స‌వంలో క‌మిష‌న‌ర్ మాట్లాడారు. అంబ‌ర్‌పేట్ పోలీసు శిక్ష‌ణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్ష‌ణ ఉంటుంది. 

*  ఈ స‌మాజంలోనూ.. ప్ర‌భుత్వ ప‌రంగా హైడ్రా  ప్ర‌ధాన మైన భూమిక పోషిస్తున్న విష‌యాన్ని గుర్తు పెట్టుకుని ప్ర‌తి ఒక్క‌రూ ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని అన్నారు. 

* ప్ర‌కృతివైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్ప‌డు ప్ర‌జ‌ల ప్రాణాల‌తో పాటు.. ఆస్తి న‌ష్టాన్ని త‌గ్గించ‌డంలో డీఆర్ ఎఫ్ పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని.. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడ‌య్యాయ‌న్నారు. 

* మ‌న‌మీద ఉన్న న‌మ్మ‌కంతోనే ప్ర‌భుత్వం ప‌లు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ద‌ని.. తాజాగా ఇసుక అక్ర‌మ ర‌వాణాను నియంత్రించే ప‌నిని కూడా మ‌న‌కు చెప్పింద‌న్నారు.  వీట‌న్నిటినీ మ‌నం ఎంతో శ్ర‌ద్ధ‌గా, బాధ్య‌త‌తో చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌న్నారు. 

* పోలీసు ప‌రీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొంద‌లేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా.. సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మిమ్ముల‌ను ఎంపిక చేశాం.  ఇది  ఎంతో పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగింద‌న్నారు. 

* ప్ర‌స్తుత త‌రుణంలో ఉద్యోగాల‌కు ఎంతో పోటీ ఉంద‌ని.. మీకు దొరికిన ఈ  అవ‌కాశాన్ని ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకుని ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాల‌న్నారు. అప్పుడే మీకు మంచి అవ‌కాశాలుంటాయ‌న్నారు.

*  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు, అగ్ని ప్ర‌మాదాలు ఇలా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు అండ‌గా.. ఉంటూ.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌ను త‌గ్గించే విధానాల‌పై వీరంతా అంబ‌ర్‌పేట పోలీసు శిక్ష‌ణ కేంద్రంలో శిక్ష‌ణ పొందుతున్నారు.

No comments:

Post a Comment