Tuesday, February 11, 2025

ఇకనుంచి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం రేవంత్ రెడ్డి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి @revanth_anumula గారు కీలక నిర్ణయాలు  తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

✅గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు.

✅ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.

✅ఆ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని చెబుతూ అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణలో పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.

✅బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. అందుకు జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి.

✅అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా ఏర్పాటు చేయాలి. ప్రతి రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలి.

✅రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలి. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ప్రాంతాల వారిగా సమీప రీచ్‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఏర్పడాలి.

✅సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం జరగాలి. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం

✅నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.

✅ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు జరగాలి. ఆఫీస్ టైమింగ్స్‌లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలి.


✅ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు @Vemnarenderredy గారు, @TelanganaCS శాంతి కుమారి గారు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ @Eanil_INC గారు, @Comm_HYDRAA కమిషనర్ రంగనాథ్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #SandMining #Telangana

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1888969599909241053?t=VqjnnhmdxL_EJBBRjhCRXg&s=19

No comments:

Post a Comment