Friday, January 31, 2025
_గౌరవ సుప్రీంకోర్ట్ & తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేసిన GHMC_
Thursday, January 30, 2025
Telangana Extends Retirement Age of University Faculty to 65 Years
#GHMC ఖైరతాబాద్ జోనల్, సర్కిల్ 18 లో జోరుగా అవినీతి
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం పరిధిలో ప్రభుత్వభూములు మాయం
Wednesday, January 29, 2025
*_ప్రజాగాయకుడు, కవి గద్దర్ అన్న 77వ జయంతి ఉత్సవాలు._*
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Tuesday, January 28, 2025
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Monday, January 27, 2025
*_#SupremeCourt hears the bail plea of phone-tapping case_*
*నా అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్*
రేరా సీరియస్ కాదు చర్యలు తీసుకోవాలి
Sunday, January 26, 2025
*_#తెలంగాణ విద్యా వ్యవస్థ లో అతిపెద్ద స్కాం_*
Saturday, January 25, 2025
*_76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.🇮🇳_*
*_VotersDay_*
Friday, January 24, 2025
*_నిజంగానే ఆదివాసీలను అడవి నుంచి నెట్టే కుట్ర జరుగుతుందా ??_*
“ఎవరైనా లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Thursday, January 23, 2025
జాతీయ బాలికా దినోత్సవం...
జాతీయ బాలికా దినోత్సవం...
2008 జనవరి 24 వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం "ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత"
మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు,విద్య, వైద్యం, పోషకాహారం,లింగ వివక్ష మొదలగు వాటిపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ జాతియ బాలికా దినోత్సవం జరుపుతున్నది.
లింగ వివక్ష తల్లి గర్భం నుండి ప్రారంభం అవుతుంది,ఫలితం భ్రూణ హత్యలు.అమ్మాయి పుట్టిన తర్వాత భారంగా భావించడం, చిన్న చూపు, విద్య విషయంలో అబ్బాయికి ఒకరకమైన విద్య అంటే ప్రైవేటు/ కాన్వెంటుకు పంపించడం, అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదా బడికి పంపించకపోవడం,అమ్మాయిలు చదవడం వృధా అనే భావన.
మనం ఎంత అభివృద్ధి చెందినా అమ్మాయి అనగానే అన్ని రకాలుగా చిన్న చూపు. విద్యకు దూరం చేసి బాల్య వివాహాలు చేయటం.
ప్రపంచంలో అధిక బాల్య వివాహాలు జరిగే దేశాల్లో భారతదేశం మూడో స్థానం ఉంది. తెలంగాణాలో సగటున రోజుకు మూడు బాల్య వివాహాలు అవుతున్నాయి. తెలంగాణలో బాలికలపై లైంగిక దాడులు అధికం, నిరుడు పోక్సోకేసులు 2434 నమోదు.
పిల్లల అక్రమ రవాణాలో 80% బాలికలే ఉన్నారు.
ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం జరుపుకొంటున్నాం. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ అవి ఏవి అమలు కావటం లేదు, ఎలాంటి మార్పు కనిపించటం లేదు.
ఆడ పిల్లలను పుట్టనిద్దాం, స్వేచ్ఛగా బతుకనిద్దాం, ఎదగనిద్దాం,చదవనిద్దాం.
వారి కలలను సాకారం చేసుకోవడానికి మనం మన వంతు చేయూతనిద్దాం,
వాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉంటారు.
Courtesy / Source by :
Anuradha Rao
President
Balala Hakkula Sangham
https://youtu.be/ELA0lEio0Rs?si=JVjJxLBPjGzA6ChD
@AnooradhaR #balalahakkulasangham
@AchyutaRao6 @sridhartoons
@edu_commissonTG
@IPRTelangana
కలం యోధులు🪶
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1882652932786831726?t=eFPORSKk1ghJZAdzrSgkgw&s=19
ఆవకాశవాద,అవినీతి అధికారులను ప్రభుత్వాలు ఎందుకు చేరదీస్తున్నయి?
“ఎవరైనా లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Wednesday, January 22, 2025
*_రేవంత్ రెడ్డి సారును సిఎం పదవి నుంచి దించేందుకు #అవినీతి ప్రభుత్వఅధికారుల కుట్ర ఇది నిజం..._*
Tuesday, January 21, 2025
*_నక్సలైట్స్ ఎవరి ప్రయోజనాలకోసం పోరాటం చేస్తుండ్రు ?_*
సమాచార చట్టం కమిషనర్ల నియామకం ఎప్పుడు?
నా 25 సంవత్సరాల జీవితంలో ఎవరిమీద చెయ్యి ఎత్తలేదు... ఈటెల
నా 25 సంవత్సరాల జీవితంలో ఎవరిమీద చెయ్యి ఎత్తలేదు. బూతులు తిట్టలేదు. కానీ ఈరోజు వ్యవస్థ చూసి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్న మీ నాయకుల అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, వారిని రక్షించాలి అనుకుంటే సంపూర్ణమైన ఎంక్వయిరీ చేసి ఎవరి స్థలాలను వారికి ఇప్పించే ప్రయత్నం చేయాలి.
దీనిలో ఇన్వాల్వ్ అయిన వారి మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వారికి అండగా ఉన్న నాయకులను హెచ్చరించాలి.
ఏకశిలా నగర్ మాత్రమే కాదు బాలాజీ నగర్, జవహర్ నగర్, అరుంధతి నగర్.. ఆరు నెలలుగా పేదలు కన్నీళ్లకు పరిష్కారం కోసం తిరుగుతున్నాను. ఇదే నా పని అయ్యింది.
ఇవన్నీ చూసిన తర్వాత ఇంత దౌర్జన్యమా ఇంత దుర్మార్గమా అనిపిస్తుంది. ఇదే గ్రామాల్లో జరిగితే తోలు తీస్తారు. ఇక్కడ బయటి నుంచి వచ్చి వాళ్లు బ్రతుకుతున్నారు ఐక్యత ఉండదు భయపడే వాళ్ళు అని వారి భయాన్ని ఆసరా చేసుకుని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు.
బాధితులు దరఖాస్తు ఇచ్చినా స్పందించని వారిపై చర్యలు తీసుకోవాలి.
మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాను.
ఈ సమస్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, నవీన్ మిట్టల్ గారికి, కలెక్టర్ మేడ్చల్ గారికి, సిపి రాచకొండ గారికి పంపిస్తా.
40 సంవత్సరాలుగా కోర్టు తీర్పు ఉన్నా కూడా ఆ భూములను అనుభవించకుండా బాధపడుతున్న వారి పక్షాన నేను నిలబడతా.
ఏ మాత్రం సోయి ఉన్నా..
ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా..
ప్రజల పట్ల ప్రేమ ఉన్నా..
వెంటనే స్పందించి ప్రజల ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను. (2/2)
@BJP4India @BJP4Telangana
Courtesy / Source by : https://x.com/Eatala_Rajender/status/1881705828279017842?t=Fk8QBlm_3h0P5gfw-xFDbQ&s=19
MP ఈటెల సారు గరం గరం అయిండు
మల్కాజిగిరి పార్లమెంట్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెముల గ్రామంలో 1985 లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మారు. కొన్న వారిలో మెజారిటీ వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగులు. వారంతా బ్యాంకు లోన్ పెట్టి కొన్నారు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి.. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించి గ్రామపంచాయతీలో ఉన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నారు.
ప్లాట్లు కొన్నవారు కోర్టుకు వెళితే కోర్టు వీడు దొంగ అని.. ప్లాట్లు కొన్న వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
2011లో మరోసారి ఇలాంటి ప్రయత్నమే జరిగింది.
మరోసారి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మొట్టికాయలు పడ్డాయి.
అయినా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో.. డిపిఓ ను మేనేజ్ చేసి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ కొట్టి వేసింది..
ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్ అమాయ్ కుమార్ ని పట్టుకొని 9 ఎకరాల భూమిని రాయించుకున్నారు. దానితో పాటు పక్కన ఉన్న ప్లాట్లను కూడా దౌర్జన్యంగా కొన్నారు. 2076 ప్ట్లాట్లలో 206 తీసుకున్నారు.
ఏకశిలా నగర్ లో 700 ఇల్లు ఉన్నాయి.
మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదు. మున్సిపాలిటీ LRS ఇవ్వడం లేదు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వందమంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. గుండాలు ఎంత బెదిరించినా సంయమనం పాటించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాధితులు కేసులు పెడుతున్నారు. పోచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు. వాని ఎంగిలి మెతుకులకు ఆశపడి కబ్జాదారును పక్షం వహిస్తున్నారు తప్ప పేదల పక్షాన ఆలోచన చేయలేదు.
నిన్న నా దగ్గరికి బాధితులందరూ వచ్చి వారిని పెడుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. నేను వెంటనే సిపి గారికి ఫోన్ చేసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని చెప్పాను. కలెక్టర్ కి ఫోన్ చేసి రోజు ఏదో ఒక కబ్జా మీద ఫోన్ చేయాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నట్టు అని అడిగాను.
నేనే స్వయంగా ఈరోజు వస్తా అని చెప్పా..
రాత్రిపూట వాళ్ల గుండాలు ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని చెప్పి మహిళలను బెదిరించారు. టెంట్ వెయ్యొద్దు కుర్చీలు వేయొద్దు మీటింగ్ పెట్టొద్దు అని హుకుం జారీ చేశారంట.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పెట్టిన గుండాల హుకుం. రాత్రి పోలీసు వాళ్లకు ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
పొద్దున్నే వచ్చాను వీళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాను.
అందులో ఒక చిరు ఉద్యోగి.. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను ఈ గుండాలు కూలగొట్టారని నా ఇల్లు చూడమని కోరితే.. అటు వెళ్ళాను.
20 మంది గుండాలు బీరు సీసాలు పెట్టి తాగుతూ ఏం చేస్తారు రా అన్నట్టు చూస్తున్నారు.. రెండు నెలలుగా మా మీద దుర్మార్గాలు చేస్తున్నారు వీరే అని చూపించగానే.. వారి దగ్గరికి వెళ్ళాను.
పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు..
రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు..
ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా.. ధర్మాన్ని కాపాడటానికి.. వాళ్లకు అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చాను.
నేను దీనిని తప్పుగా భావించడం లేదు.
ప్రజల పక్షాన నిలబడ్డాను అనుకుంటున్నాను.
పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులను, ప్రజలను కాపాడటంలో విఫలమైనప్పుడు ప్రజలే తిరగబడతారు.
మీరు సిగ్గుపడాలి.
ఇంతమంది ఇన్ని రోజులుగా దరఖాస్తులు ఇచ్చినా,
కోర్టు తీర్పులు ఉన్నా.. న్యాయం వీరి పక్కన ఉన్నా కూడా న్యాయం కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. (1/2)
@BJP4India @BJP4Telangana
Courtesy / Source : https://x.com/Eatala_Rajender/status/1881704886863306974?t=Nj_pCTpyjhmNb1wBdp4uPQ&s=19
*_RTC అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు ఇబ్బందులు_*
*_#GHMC పార్కులు ప్రయివేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు తెలుపగలరు._*
Sunday, January 19, 2025
*#SayNoToDrugs*
Saturday, January 18, 2025
*#GHMCuppalCircle-2 లో అవినీతి*
కలం యోధుల కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ
#Environment #Echofriendly #Savelakes #SaveHussainsagar #SaveOsmansagar #Savehimayathsagar #SaveMusiNadi #pollution #Awareness #Hyderabad
@TelanganaCMO
@IPRTelangana @HyderabadCitiz9 @abntelugutv @NallakuntaAssn @BplplH @krishna_avs @GHMCOnline @HMDA_Gov @తెలంగాణాపీసీబీ
కలం యోధులు🪶
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1880606968056025129?t=S-8pNir-8RGhI-bUWVSFfA&s=19
*_ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు_*
Friday, January 17, 2025
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_ఎంతో చరిత్ర కలిగిన బతుకమ్మ కుంటను కొన్నేన్లుగా కబ్జా చేస్తుంటే నిద్దుర పోయిన 👇_*
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_#తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సారును అరెస్టు చేసేది ఎవరు ??_*
*_BIG BREAKING NEWS_*
https://youtu.be/GHvlJDBWjiQ?si=z4duW5sCuwTcftaZ
*Complaint filed to @TelanganaACB to FIR on CM @revanth_anumula @mega Krishna reddy @mpponguleti @Vemnarenderredy in #KodangalLiftIrrigationScam.*
*45 Phones including Ministers,MPs,MLAs #Phonetapping*
*రేవంత్,పొంగులేటి ,మెగా, వేం నరేందర్ పై #FIR చెయ్యాలి*
***-----***-----***-----***
*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*
*_#తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సారును అరెస్టు చేసేది ఎవరు ??_*
*_#TelanganaThalli సాక్షిగా #తెలంగాణ లో జరిగిన, జరుగుతున్న #అవినీతి అక్రమాలమీద వాస్తవాలతో అలుపెరుగనిపోరాటం చేస్తున్న @zson_bakka అన్న గారికి అభినందనలు ✊_*
*@RahulGandhi @priyankagandhi @kharge @DeepaDasmunsi @GpkOfficial_ @Bmaheshgoud6666*
*@TelanganaACB @IPRTelangana*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1880249477753368618?t=T2dQsS_7lkfMfjdJK7zVXQ&s=19
మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజి
*_హైదరాబాద్ సిటిజెన్స్ ఫోరం (HCF), హైదరాబాద్ జిందాబాద్ 2025 సంవత్సర క్యాలెండర్_*
Thursday, January 16, 2025
*అంబర్పేట్ ఫ్లై ఓవర్ రెడీ.. త్వరలోనే ప్రారంభం*
హైదరాబాద్లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- అంబర్పేట్ ఫ్లై ఓవర్ రెడీ.. త్వరలోనే ప్రారంభం
- నాలుగేండ్లు కొనసాగిన పనులు
- 1.6 5కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మాణం
- రూ.445 కోట్ల ఖర్చు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్ పేట్ ఫ్లై ఓవర్ త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. నాలుగేండ్ల కింద మొదలైన పనులు ఈ మధ్యే పూర్తయ్యాయి. రూ.445 కోట్లతో గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు 1.625 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్ ఇది. అయితే భూసేకరణకు కావాల్సిన రూ. 140 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది.
2018లో శంకుస్థాపన..2021లో పనులు షురూ
ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలయ్యాయి. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట అంచనా వ్యయం రూ.216 కోట్లుగా అనుకున్నారు. ఇందులో రూ.117 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ కాగా, రూ.99 కోట్లు భూసేకరణ కోసం ఖర్చవుతుందని భావించారు. అయితే, రెండు వర్గాలకు చెందిన కట్టడాలపై నుంచి ఫ్లై ఓవర్ కట్టడానికి ఒప్పుకోలేదు. దీంతో కొంతమేర రూట్ మార్చడం, భూసేకరణ ఎక్కువ కావడం, టైం కూడా మించి పోవడంతో రూ.445 కోట్ల అంచనాతో రివైజ్ చేశారు. ఇందులో రూ.265 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ , రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చయ్యాయి. భూసేకరణ కోసం రూ.140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
ట్రాఫిక్ లేని జర్నీ
ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్వెళ్లేవారితో పాటు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది. ఇంతకుముందు ఛే నంబర్, శ్రీరమణ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయేది. ఫ్లై ఓవర్వస్తే చాదర్ఘాట్ నుంచి సిగ్నల్ తగలకుండా రామాంతాపూర్, హబ్సిగూడ స్ర్టీట్ నెంబర్ 8 వరకు ఈజీగా చేరుకోవచ్చు. ప్రధాని మోడీ లేదా కేంద్రమంత్రి గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించే అవకాశముంది. వారు హాజరుకాలేని పక్షంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రారంభిస్తారని తెలుస్తోంది.
Courtesy / Source by : https://www.v6velugu.com/after-a-long-wait-amberpet-flyover-to-be-thrown-open-to-citizens-soon