Thursday, September 1, 2022

విదేశాలకు వెళ్లేందుకు... శస్త్ర చికిత్స ద్వారా వేలిముద్రలు మార్చేస్తున్నారు... సీపీ

*విదేశాలకు వెళ్లేందుకు... శస్త్ర చికిత్స ద్వారా వేలిముద్రలు మార్చేస్తున్నారు... సీపీ*

హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు వీలుగా వేలిముద్రల్ని మార్చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల్ని మల్కాజ్‌గిరి పోలీసులు పట్టుకున్నారని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లా వాసి నాగమునీశ్వర్‌రెడ్డిని ఈకేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు వెల్లడించారు. నాగమునీశ్వర్‌రెడ్డి తిరుపతిలో రేడియాలజీ కోర్సు చేశాడని వివరించారు. వీసా గడువు పూర్తయిన వారిని కువైట్‌ నుంచి వెనక్కి పంపుతున్నారని, అలా వచ్చిన వారిలో కొందరు శ్రీలంక వెళ్లి ఫింగర్ ప్రింట్‌ సర్జరీ చేయించుకున్నట్టు గుర్తించామని సీపీ తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన ఫింగర్‌ ప్రింట్‌ ఏడాది పాటు ఉంటుందని, వీరంతా నకిలీ ఫింగర్ ప్రింట్‌ ద్వారా విదేశాలకు వెళ్లేందుకు మళ్లీ కుట్ర చేస్తున్నారని వివరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

No comments:

Post a Comment