అజారుద్ధీన్ పై మానవ హక్కుల కమిషన్ లో కంప్లైంట్.
ఉప్పల్ లో జరగబోయే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో హెచ్ సీఏ పూర్తి వైఫల్యం చెందిందన్నారు. క్రీడాభిమానుల నుండి లక్షల, కోట్ల రూపాయలు దండుకొని.. టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయని హెచ్ సీఏ, ఇతర రాజకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మైన్ రాచాల యుగంధర్ గౌడ్.
కాగా నిన్న జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న జరిగే ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ కి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. కానీ గేట్లు మూసి వేసి ఉండటం, అధికారులెవరూ లేకపోవడంతో ఫ్యాన్స్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు.
No comments:
Post a Comment