Tuesday, September 20, 2022

దసరా సెలవులు తగ్గించండి

దసరా సెలవులు తగ్గించండి

 
దసరా సెలవులు తగ్గించండి
  • విద్యాశాఖ డైరెక్టర్‌కు ఎస్సీఈఆర్టీ ప్రతిపాదన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): దసరా సెలవులు తగ్గించడం లేదా రెండో శనివారాల్లోనూ పాఠశాలలను నడిపేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేనకు మంగళవారం లేఖరాశారు. భారీ వర్షాలతో జూలై 7 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో 2022 -23 విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయిందని లేఖలో ప్రస్తావించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొత్తం పని దినాలు 230 కాగా, జరిగిన నష్టాన్ని పూరించేందుకు పై రెండు ప్రతిపాదనలను సమర్పించారు.

ప్రతిపాదనలివే..

  • అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు 14 రోజులు ప్రకటించిన దసరా పండుగ సెలవులను వాయిదావేసి తాజాగా అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు 9 రోజుల పాటు రీషెడ్యూల్‌ చేసేందుకు అనుమతించాలి. దీంతో 5 పని రోజులు స్కూళ్లు నడిపి భర్తీచేయవచ్చని పేర్కొన్నారు.
  • రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లను రెండో శనివారాల్లోనూ నడిపేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. ఇలా నవంబర్‌, డిసెంబర్‌, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలో స్కూళ్లలో తరగతులు నిర్వహించడం ద్వారా ఐదు రోజులు కలిసివస్తుందని లేఖలో ప్రస్తావించారు.

No comments:

Post a Comment