*కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా....? నిర్మలా సీతారామన్ ఫైర్....!*
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్‌పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్‌లో శుక్రవారం రేషన్ షాప్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలా సీతారామన్..
రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంతని కామారెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే కలెక్టర్ తెలియదని సమాధానం చెప్పడంతో.. 'కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా' అని నిర్మలా మండిపడ్డారు. అరగంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్‌ను ఆదేశించారు.పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 30 రూపాయలు భరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. రేషన్ షాప్ ఫ్లెక్సీలో మోదీ ఫోటో లేకపోవడం గమనించిన కేంద్ర మంత్రి.. ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని మళ్లీ కలెక్టర్‌ను నిలదీశారు. మోదీ ఫోటో పెట్టకపోతే సాయంత్రం తానే వచ్చి కడతానని నిర్మలా చెప్పారు.
*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం
No comments:
Post a Comment