పత్రికా ప్రకటన 24-09-2022
రాంకీ సంస్థతో జిహెచ్ఎంసి
కుదుర్చుకున్న ఒప్పందం విరమించుకోవాలని
ఆందోళనకు దిగిన ఎఐటియుసి సిబ్బంది
--------------------------------------------------------
సెప్టెంబర్ 24 హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్మికుల శ్రమ దోపిడి కోసం రాంకీ సంస్థతో కుదుర్చుకున్న చికటి ఒప్పందాన్ని విరమించుకోవాలని, ఎండ, వాన, రాత్రి, పగలనక ప్రజా ఆరోగ్యాలకోసం పనిచేస్తున్న కార్మికుల గోస పట్టించుకోకుంటే, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం 24 వేలు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మందా వెంకటేశ్వర్లు, కె.యేసురత్నం హెచ్చరించారు. శుక్రవారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ వరకు ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలో గల ఆరు జోన్ల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రదర్శనగా వచ్చి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ మేయిన్ గేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మందా వెంకటేశ్వర్లు, కె.యేసురత్నం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ మాట పక్కన పెడితే కనీస వేతనాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు శ్రమ దోపిడకి గురౌతున్నారని గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి లో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు చికటి ఒప్పందాన్ని చేసుకొని రాంకి అనే సంస్థతో జిహెచ్ఎంసి చేతులు కలిపడం జిహెచ్ఎంసి పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయించడం పట్ల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిహెచ్ఎంసి లో మలేరియా విభాగంలో గతంలో దోమల మందు పిచికారి చేయడానికి ఇద్దరు సిబ్బంది ఉండెవారని ఇప్పుడు ఇద్దరు చేసే పని ఒక్కరితోనే సక్కబెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. అదేవిధంగా గ్రూపుల్లో 7గురు కార్మికులు ఉండాలి కాని కొన్ని గ్రూపుల్లో 3 లేదా 4 గురు మాత్రమే ఉన్నారని ప్రతి గ్రూపులో 7 గురు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ లలో పనిచేస్తున్న సిబ్బందికి సేఫ్టీ పరికరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రవిచంద్ర, ముడి మార్టిన్, నాయకులు సుధాకర్,డి.రాములు, పి.హరినాద్, ఆనంద్, చిరంజీవి, మహేందర్,డి.ఎం.శేఖర్, నీలమ్మ, అనితా,లక్షమమ్మ, వీణా,కలమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment