Thursday, June 11, 2020

తెలంగాణ విద్యుత్ బిల్లులు

హైదరాబాద్ : 12/06/2020

*Draft press release*

కరోనా మహమ్మారి విజృంభణ మరియు ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలననుసరించి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ తమ విద్యుత్ వినియోగదారుల ఏప్రిల్, మే నెలలలో విద్యుత్ వినియోగ రీడింగ్ నమోదు చేయలేదు. ప్రస్తుతమున్న లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపుల నేపథ్యంలో జూన్ నెలలో రీడింగ్ నమోదు చేసి బిల్లులు జారీ చేయడం  జరిగింది. జూన్ లో జారీ చేసిన బిల్లు మార్చ్, ఏప్రిల్ మరియు మే నెలల విద్యుత్ వాడకం బిల్లు. ఈ బిల్లులో నమోదైన వాడకాన్ని (యూనిట్లను) మూడు సమాన భాగాలుగా విభజించి, తగు కేటగిరి ప్రకారం లెక్కించి బిల్లులు జారీచేయడం జరిగింది. 
గత ఏడాది 2019 మార్చ్, ఏప్రిల్ నెలల్లోని వాడకం బిల్లును ఆధారం చేసుకుని ఏప్రిల్, 2020 , మే 2020 నెలల్లో SMS, ఆన్లైన్ ద్వారా తాత్కాలిక (Provisional) బిల్లులు పంపడం జరిగింది. లాక్ డౌన్ వలన బిల్లులు జారీచేయలేక పోతున్నామని తమకు పంపిన తాత్కాలిక (Provisional) బిల్లులు చెల్లించాల్సిందిగా పత్రికల, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా  వినియోగదారులను కోరడం జరిగింది. ప్రస్తుతం జారీచేసిన బిల్లులో ఏప్రిల్, మే నెలలలో ఏ వినియోగదారులైతే చెల్లించారో, వారు కట్టిన అమౌంట్ ని బిల్లులో తగ్గించి సర్దుబాటు చేయడం జరిగింది.
మూడు నెలలకు సంబంధించి ఒకే సారి రీడింగ్ తీయడం వల్ల బిల్లులు అధికంగా వచ్చాయని కొంత మంది విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం సంస్థ దృష్టికి వచ్చింది. బిల్లులపై వినియోగదారులకు గల సందేహాలను నివృత్తి చేసి, వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను సంస్థ పరిధిలోని అన్ని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు వినియోగదారులు క్రింద పేర్కొన్న సామజిక మాధ్యమాల ద్వారా తమ బిల్లుకు సంబంధించిన సమస్యలను సంస్థకు పంపగలరని చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి రఘుమా రెడ్డి తెలిపారు.
1.  customerservice@tssouthernpower.com 
2. TsspdclCorporat@twitter; 
3. gmcsc.tsspdcl @facebook.com 
e-మెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అందుకున్న ఫిర్యాదులను 2 పని దినములలో పరిష్కరించి  బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా వినియోగదారునికి జవాబు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులకు  ఆదేశాలు జారీ చేసినట్టు  సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి తెలిపారు.

విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ వాడకం బిల్లులపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నయెడల తమ బిల్ పైభాగం లో ముద్రించిన ఎలక్ట్రిసిటీ రెవిన్యూ ఆఫీస్ (ERO) ను సంప్రదించి గాని (లేదా) పైన పేర్కొన్న సంస్థ ఇమెయిల్/ ట్విట్టర్/ పేస్ బుక్ కు పంపి తమ సమస్య ను పరిష్కరించుకోగలరు. సంస్థ మనుగడ వినియోగదారులు చెల్లించే బిల్లులపై ఆధారపడి ఉంటుంది గనుక సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ అభివృద్ధికి తోడ్పడగలరని సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి  కోరారు.

గ్రూప్ link Media *సమాచార హక్కు సమితి **

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment