హైదరాబాద్ :04/06/2020
*తెలంగాణాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో కొంతమంది పిల్లల తల్లితండ్రులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం జరిగింది మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లో PIL వేయడం జరిగింది అందరికి తెలిసిందే, ఈరోజు హియరింగ్ ఉండగా అది రేపటికి (05/06/2020)వాయిదా పడింది.*
అయితే తెలంగాణ ప్రభుత్వం పరీక్షల విషయం లో కొన్ని మార్గదర్శాలు ఈరోజు విడుదల చెడింది.
*టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ముఖ్య గమనిక*
బెంచీ, బెంచీకి 4-5 ఫీట్ల దూరం, ఒక్కో గదిలో 15మంది విద్యార్థులే:
* కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకున్నారు.
బెంచీ, బెంచీకి 4-5 ఫీట్ల దూరం.
ఒక్కో గదిలో 10 -15 మంది విద్యార్థులకే అనుమతి.
* పాత పరీక్షా కేంద్రాలతోపాటు కొత్తగా 346 కేంద్రాలను ఏర్పాటు.
* ఎవరు, ఏ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందన్న వివరాలను డీసీఈబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో.
* ఒకే ప్రాంగణంలోని అదనపు కేంద్రాలకు ఏ, బీ కేంద్రాలుగా విభజన.
* కొత్తగా ఏర్పాటుచేసిన వాటిని పాత కేంద్రాలకు 500 మీటర్ల దూరంలోనే నెలకొల్పారు.
* విద్యార్థులు పాత హాల్ టికెట్‌తోనే పరీక్ష రాయవచ్చు.
* ఎవరైనా విద్యార్థులు హాల్‌టికెట్ పొగొట్టుకొని ఉంటే ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచన.
విద్యార్థులు చేయాల్సినవి, చేయకూడనివి:
* పరీక్షా కేంద్రాల దగ్గర తోటి విద్యార్థులతో గుమిగూడకుండా ఎవరికి వారు జాగ్రత్త పడాలి.
* పరీక్షకు హాజరయ్యేవారంతా విధిగా ఫేస్ మాస్క్ ధరించాలి.
* షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం, ఇతరుల పెన్నులు, పెన్సిళ్లను నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి.
* పరీక్ష రాసి ఇంటికి వెళ్లగానే ప్యాడ్‌తోపాటు పెన్నులను శానిటైజ్ చేసుకోవాలి.
* నిత్యం పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి.
సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్:
టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ సందేహాలను 040 - 29701474 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలు సహా ఇతర ఎలాంటి సందేహాలనైనా తీర్చుకునేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాలను సందర్శించి రావడం మంచిదని చెప్పారు.
గ్రూప్ link Media 10tv సౌజన్యంతో
ప్రజా సంకల్పం
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
04/06/2020
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment