Saturday, June 13, 2020

భారీ వర్షాలు

హైదరాబాద్ : 13/06/2020

*తెలంగాణ సహా 3 రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్.. రెడ్ అలెర్ట్ జారీ**

వర్షాలు ప్రారంభం అయ్యాయి... కొన్ని ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి.. ఇదే సమయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వార్నింగ్ ఇచ్చింది.. మూడు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీచేసిన భారత వాతావరణ విభాగం.. మరో నాలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చెపింది.. తెలంగాణ, కర్ణాటక, గోవాలో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ విభాగం... ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశా, మేఘాలయాల రాష్ట్రాలకు కూడా వర్ష సూచన ఉందని చెప్పింది. బంగాళాఖాతంలోని పశ్చిమ-మధ్య మరియు వాయువ్య ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనము రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

జూన్ 13 నుండి 16 వరకు రాజస్థాన్‌లో వేడి తరంగాల పరిస్థితులతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అంటోంది ఐఎండీ.

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment