హైదరాబాద్ : 06/06/2020
*ACB అప్డేడేట్స్........*
షేక్పేట్ మండల ఆఫీస్ లో తన భూమి హద్దులు చూపించాలని దరఖాస్తు పెట్టుకున్నా బాధితుడు..
ఇదే విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది..
బాధితుడు ల్యాండ్ పైకి వెళ్లడంతో షేక్ పెట్ తాసిల్దార్ ఏప్రిల్ నెలలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
తాసిల్దార్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు..
షేక్పేట్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి.. బాధితుని వద్ద నీకు ఫేవర్ గా చేయడానికి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్..
ఈరోజు 15 లక్షలు రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు..
ఇదే కేసు విషయంలో బంజారాహిల్స్ లో పనిచేస్తున్న రవీందర్ నాయక్ బాధితుని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్ష 50 వేల రూపాయలను తీసుకున్నాడు..
మళ్లీ కేసు నుండి నిన్ను తప్పించాలి అంటే మరో మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని బాధితుని డిమాండ్ చేసిన ఎస్సై రవీందర్ నాయక్..
దీంతో ఎస్సై రవీందర్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment