_'కల'లో.._
*_ఏపీ సిఎంగా కేసిఆర్.!_*
_* బిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రంగంలోకి_
_* చంద్రబాబుపై కసితోనే_
_* జగన్ తో లోపాయికారి ఒప్పందం.?_
Courtesy / Source by :
_(ఇది వంగ్య రచన: అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_ఆరు నెలల్లో 'కేసిఆర్ ముఖ్యమంత్రి' అంటూ కడియం శ్రీహరి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అది నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం._*
*https://telanganawatch.in/article.php?data=kcr-as-ap-cm-in-dreem*
*_జాతీయ పార్టీ కదా..?_*
_2001లో టిఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ అయింది. 21 ఏళ్ళ తర్వాత అనగా అక్టోబర్ 5, 2022న బిఆర్ఎస్ గా మారింది. దీంతో ప్రాంతీయ పార్టీ కాస్తా జాతీయ పార్టీగా మారింది._
*_జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..:_*
_1). కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం చివరి సారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి._
_2). ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి._
_3). ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి._
_3). కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి._
_4). గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి._
*_ఆంధ్రప్రదేశ్ లో పోటీ ఖాయం_*
_ఏ విధంగా చూసినా బిఆర్ఎస్ జాతీయ పార్టీగా నిజంగా ఎదగాలనే లక్ష్యంతో ఉంటే.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలి. గెలవాలి. అక్కడ ముఖ్యమంత్రి కావాలి._
*_చివరిగా..:_*
_తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తిట్టిన తిట్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి మర్చిపోగలరు. మీకు చీము, రక్తం లేకుంటే.!_
బాక్స్:
*_ఇదిగో రెండవ అవకాశం.!_*
_భారత్ లో కిడ్నాప్, అత్యాచారం వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. నిత్యానంద కైలాస దేశం ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఏర్పాటు చేయబడింది._
_ఇదే విధంగా కేసిఆర్ కూడా ఓ స్వతంత్ర దేశం ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశంలోని అన్ని పదవులు తనకు, తన వాళ్ళకు 'తెలంగాణ'లో ఇచ్చుకున్నట్లు ఎంచక్కా ఇచ్చుకోవచ్చు._
No comments:
Post a Comment