Saturday, December 30, 2023

కాలేజీ స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలతో ఈటెల

హైదరాబాద్ : యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, సైఫాబాద్ లో నిర్వహించిన  “Mega Alumni Meet -2023” లో పాల్గొని ప్రసంగించడం జరిగింది.

ఈ కాలేజీలో 1981 నుండి 84 వరకు హాస్టల్ ఉండి డిగ్రీ పూర్తి చేశాను. స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాలేజీ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. అరే అని పిలవగలిగే హక్కు ఒక్క స్కూల్, కాలేజీ ఫ్రెండ్ కే ఉంటుంది.

ఆనాడు విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేది. ఏ వ్యవస్థ కొలాప్స్ అయినా రిపేర్ చేసుకోవచ్చు.. కానీ పొలిటికల్ లీడర్ కొలాప్స్ అయితే వ్యవస్థ కొలాప్స్ అవుతుంది.

సమాజాన్ని డ్రైవ్ చేసే సత్తా ఉన్నవాళ్లు మనకెందుకులే అనుకోవడం బాధాకరం. ప్రజాస్వామ్యం మీద రాజకీయాల మీద అసహ్యించుకోవడం కంటే మన తలరాతలు మార్చే వ్యవస్థల మీద కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.

చరిత్ర చూస్తే.. రాముడు గొప్పతనం రావణుండు ఉన్నప్పుడే..
మంచోడి గొప్పతనం చెడ్డోడు ఉన్నప్పుడు తెలుస్తుంది.

రాజకీయ నాయకుణ్ణి పనితీరును బట్టి ఎన్నుకోవాలి తప్ప వారి ప్రామిసెస్ ను బట్టి కాదు.

నేను బయోలాజికల్ స్టూడెంట్ ను, ఎకనామిస్ట్ ను కాదు. కాని తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్ధిక మంత్రిగా నా ప్రసంగంలో మొదటి పేరాలో ఒక లైన్ రాశాను.. ఈడబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే భాద్యత ఉంది అని చెప్పిన. అది సైఫాబాద్ సైన్స్ కాలేజీ నేర్పిన చైతన్యం.

ఓల్డ్ ఈస్ గోల్డ్ అని నేను బలంగా నమ్ముతా. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలది, న్యాయానిది, ధర్మానిది.

చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే.

సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన.. ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ తేలేదు. ఇక మీద కూడా తేకుండా ఉంటానని మాట ఇస్తున్నాను.

https://twitter.com/Eatala_Rajender/status/1741067158309011794?t=RQ0tiwaDTHbeRk3fMwkdXQ&s=19

No comments:

Post a Comment