ప్రియురాలి కోసం దిగజారిన ఐపీఎస్.!
* ఇద్దరి సహజీవనం వెల రూ.14 కోట్లు
* స్వంత ఖాతాల్లోనే డబ్బులు వేసుకున్న వైనం
* హైదరాబాద్ లో ఖరీదైన విల్లా.!
* హోంగార్డు ఉద్యోగాల పేరిట ఘరాన మోసం
* హోంగార్డు ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి ఉద్యోగాలు
* ఆ తర్వాత మరికొందరికి నకిలీ అపాయింట్‌మెంట్లు
* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
* కేసు నమోదు
* హ ప్రియురాలి అల్లుడు అరెస్ట్
* అంతా రహస్యం..
* 'నువ్వు రాయ్.. నీ సంగతి చూస్తా..' అంటూ బెదిరింపు
* రాస్తున్నాను.. ఏ గడ్డి పీక్కుంటావో పీక్కో.!
* నా ఫుల్ డిటైల్స్ ఇస్తున్నా..
Courtesy / Source by :
(అనంచిన్ని వెంకటేశ్వరావు, అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)
ఆ ఐపిఎస్ అధికారికి ఓ వీక్ నెస్. అందంగా ఉందని సరదాగా సహజీవనం. ఆ ప్రియురాలి కోసం ఆయన ఫోర్జరీలకు సైతం దిగజారాడు. ఇద్దరి స్వంత ఖాతాల్లోనే డబ్బులు వేసుకున్నారు. ఆమె కోసం ఆ ఐపిఎస్ ఏకంగా హైదరాబాద్ లో ఓ విలాసవంతమైన విల్లా కూడా కొనుగోలు చేశాడు. ఓ బాధితుడు కేసు పెట్టాడు. సామాన్యుల విషయంలో నానా 'యాగీ' చేసి, 'గాయగత్తర' చేసే పోలీసులు ఈ విషయం అత్యంత కీలకమైన రహస్యంగా ఉంచారు. ఆ ఐపిఎస్ తాజాగా బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. వివరణ కోసం ప్రయత్నం చేస్తే... "రాస్తే.. నీ సంగతి చూస్తా" అన్నాడు. రాస్తే ఓ పనైపోతుంది కదా.! జర్నలిస్ట్ ను బెదిరించినందుకే గట్టిగా రాస్తున్న. ఏలూరు నుండి హైదరాబాద్ నీ విల్లా వరకు ఏ గడ్డి పీక్కుంటావో.. పీక్కో ఫో..! దిగజారినోడు కూడా బెదిరించుడే.! బొత్తిగా జర్నలిస్టులు అంటే భయం లేకుండా పోయింది. అమ్మా..! అందరూ ఒకేలా ఉండరు. నాలోంటోళ్ళు కూడా అక్కడక్కడా ఉంటారు. నా కత్తికి అన్ని వైపులా పదునే.! జర జాగ్రత్త మరి. విజయవాడలో ట్రిపులెక్స్ ఇంటికి ఉచితంగా స్లాబ్ వేయించావు కదా.!
ఏలూరులో తగులుకున్నాడు..:
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు.
రూ.14 కోట్లకు పైగా:
అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు.
ఇలా అనుమానం వచ్చి..:
దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్‌మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.
ఇద్దరి ఖాతాల్లోకి... ఖరీదైన విల్లా.!
అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్టు సమాచారం.
బెయిల్ కోసం..:
దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
No comments:
Post a Comment