Saturday, December 2, 2023

_ఎన్నికల అధికారులూ... ఇదేం పద్దతి_

*_ఎన్నికల అధికారులూ... ఇదేం పద్దతి_*

*_హన్మకొండ జిల్లా, పరకాల శాసనసభ నియోజకవర్గానికి చెందిన 203 నుండి 225 పోలింగ్ బూత్‌ల పరిధిలోని EVMలు, అందులో పోలైన ఓట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన జాబితాలో లేవ్.._*

*_ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యుల డిమాండ్_*

_అసలేం జరిగింది..?:_
హన్మకొండ జిల్లా, పరకాల శాసనసభ నియోజకవర్గానికి చెందిన 203 నుండి 225 పోలింగ్ బూత్‌ల పరిధిలోని EVMలు, అందులో పడిన ఓట్లు ఈ జాబితాలో లేవు.
అధికారికంగా విడుదల చేసిన  ఈ 11 పేజీల జాబితాను పరిశీలిస్తే.. అందులో 203 నుండి 225 పోలింగ్ బూత్‌లకు చెందిన వివరాలు లేవు.

 ఆ వివరాలకు చెందిన పేజీ మిస్సయ్యిందా.? వివరాలు తెలాల్సి ఉంది.

హన్మకొండ జిల్లా పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో పరకాల ఒకటి. మరొకటి వరంగల్ పశ్చిమ (హన్మకొండ). ఈ అధికారిక జాబితాలోనే  పరకాల సెగ్మెంట్‌లోని 203 నుండి 225 పోలింగ్ బూత్‌ల వివరాలు లేకపోవడం కలకలం రేపుతోంది.

ఇది టైపోగ్రాఫికల్ పొరపాటా..? లేక ఎన్నికల అధికార తప్పిదమా.? లేక అస్సలు మొత్తానికే గల్లంతా..? అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనుమానం. రేపు ఈ ఈవీఎంలు లెక్కించబడతాయో..? లేదో..?  తెలియాల్సి ఉంది.

హన్మకొండ జిల్లా, పరకాల నియోజకవర్గ పరిధిలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 
మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు మహిళలు, పురుషుల సవివరంగా ప్రకటించిన
ఎన్నికల అధికార యంత్రాంగం.. ఈ జాబితాలోని 203 నుండి 225 పోలింగ్ బూత్‌లు అనగా 23 పోలింగ్ బూత్ లు, అందులోని ఈవీఎంలు, అందులో పోలైన ఓట్లు, తదితర వివరాలు జాబితాలో కన్పింఛకపోవడం సంచలనం కలిగిస్తోంది. అదికూడా అధికారికంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం విడిగా ప్రకటించిన పరకాల నియోజకవర్గం, ఉమ్మడిగా ప్రకటించిన హన్మకొండ జిల్లా జాబితాలో, పరకాల, హన్మకొండ నియోజకవర్గాల జాబితాలో కూడా ఈ 23 కేంద్రాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, అందులో పోలైన ఓట్లు, జాబితాలో అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. రేపటి లెక్కింపులో అవి చేరుతాయో లేదో 'ప్రజాస్వమ్య పరిరక్షణ వేదిక' బయట పెట్టడంతో... రేపు ఏం జరిగనున్నదో..? తేలాల్సి ఉంది.

No comments:

Post a Comment