కడియం ఖబడ్దార్.!
● జర్నలిస్ట్ సంఘాల బహిరంగ సవాల్
● ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు..!
● 'కులం' కార్డ్ వెనుక దొర..!
● దొర బాగోతం ఆధారాలతో ఆదివారం ఉదయం బట్టబయలు చేస్తా.!
● దమ్ముంటే ఆ విషయంపై మాట్లాడు.!
● సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?
(అనంచిన్ని వెంకటేశ్వరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయులు, 9440000009)
ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతోంది.? ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటామని బరితెగించి బహిరంగంగా చెప్పటం.. అదీ ఓ సీనియర్ మాజీమంత్రి కడియం ఇటీవల శ్రీహరి వాఖ్యానాలకు ఇది బహిరంగ సవాల్.! దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. లేదంటే నా కలం పదును ఓ 'అణుబాంబు' లాంటిది. దొర పాలన వద్దని మిమ్మల్ని, ప్రజాస్వామ్య పాలన కావాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించారు ప్రజలు. మీకు, కాంగ్రెస్ కు మధ్య నేను అనే అనంచిన్ని వెంకటేశ్వరావు ఉన్నాడు. నన్ను దాటుకొని వెళ్ళగలరా..? దమ్ముంటే ఆపు.! ఫాంహౌస్ లో నిద్రపోతున్న కేసీఆర్ గురించి ఈనెల 10న, ఉదయం 10.00 గంటలకు ట్రైన్ EXCLUSIVE ఛానల్ లో ప్రత్యేక పరిశోధన కథనం ఇస్తా... లింక్ ఇదే...!
https://www.youtube.com/live/XiRyo3HXglk?si=85P6YlYGrD_o-xIO
అసలేం జరిగిందంటే..?:
ఒక్క కేసీయార్ చేశాడని ఏమీ లేదు. దేశమంతా జరుగుతున్నదే.! ఎమ్మెల్యేలు, ఎంపీలు 'అమ్మకపు సరుకు' కావడం ఈ దేశం దౌర్భాగ్యం..! సో, ఫలానా పార్టీ దీనికి అతీతంగా ఉందని ఏమీ చెప్పలేని దురవస్థ..! ఇక కొన్ని విషయాలు చెప్పుకుందాం.!
నేను 'అంత ఘోరంగా పాలించానా..?
మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరీ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కొట్టేస్తే చంద్రబాబు బాగా బాధపడ్డాడు.! నేను 'అంత ఘోరంగా పాలించానా..? ప్రజలకు, రాష్ట్రానికి ఏం నష్టం చేశాను..?' అనేది తన ఆవేదన.! నిజానికి కేసీయార్ కూడా అలా భావించాల్సిందే.! తను ఏ ఆంధ్రులనైతే ద్వేషిస్తూ తన పొలిటికల్ కెరీర్‌ను పీక్స్‌లోకి తీసుకెళ్లాడో, ఆ ఆంధ్రులే ఈరోజు తన వెనుక నిలబడి ఓట్లేశారు… హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కొన్ని ప్రాంతాల సీట్లు వాళ్ల పుణ్యమే.! అవే లేకపోతే కేసీయార్ సీట్లు కూడా ఏ 23 దగ్గరోె ఆగిపోయేవి.! ఇది ఫక్తు రియాలిటీ.!
అది స్వయంకృతం.!
ఏ తెలంగాణవాదాన్ని నమ్మాడో, ఏ తెలంగాణవాసినే నమ్మాడో ఆ తెలంగాణ మనిషే తనను నమ్మడం లేదు. అది స్వయంకృతం.! ఇక్కడ ఆ కారణాల ఏకరువులోకి వెళ్లడం లేదు. కానీ ఆ కారణాల మథనం లేదు ఆ పార్టీలో.. దిద్దుబాటు ప్రయత్నం లేదు.! ఉండదు. పైగా అప్పుడే మొదలు పెట్టేసింది. కేసీయార్ స్వగ్రామం చింతమడక నుంచి వందల మంది ఫామ్ హౌజుకు వచ్చి కేసీయార్‌ను ఓదార్చారు. తను 'అక్కడ పుట్టాడు' అనే కారణంతో ఇంటికి పదీ, పదిహేను లక్షలు ఇచ్చాక ఆ కృతజ్ఞత లేకపోతేనే తప్పు.! ఎవరు తీసుకొచ్చారు, ఈ ఓదార్పు యాత్ర ఎవరు ఆర్గనైజ్ చేశారనేది కాదు ఇక్కడ ప్రశ్న. అప్పుడే మొదలు పెట్టేశాడు కేసీయార్ అనేది గమనార్హం.!
ఓటమిని వినమ్రంగా అంగీకరించలేదు..
ఈరోజుకూ కేసీయార్ తన ఓటమిని వినమ్రంగా ప్రజల ఎదుట అంగీకరించలేదు. హూందాగా గవర్నర్ దగ్గరకు వెళ్లి రాజీనామా సమర్పించలేదు. ఆమెకు మొహం చూపించలేడు కాబట్టి..! ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని, ప్రజాతీర్పును గౌరవిస్తాననీ అనలేదు. పైగా బీఆర్ఎస్ నేతలు అప్పుడే ఏమంటున్నారు..? ‘‘ఆరు నెలలు ఆగండి, ఏడాది ఆగండి, మళ్లీ మేమే…’’ అని.. ఇంకెవరో ముఖ్యనేత ఏదో అన్నాడు.. ‘‘సింహంలా కేసీయార్ బయటికి వస్తాడు త్వరలో..’’ అని..
అసందర్భ వ్యాఖ్యలు
పార్టీ లీడర్ ఒకరు మరణిస్తే, ఆ సంతాప సభలో మాట్లాడుతూ కడియం శ్రీహరి అసందర్భ వ్యాఖ్యలకు దిగాడు. ‘‘మాకు 39 సీట్లు, మా మజ్లిస్ మా పక్షమే.! బీజేపీ కూడా కలిసొస్తుంది. ఇంకొందరు కలిస్తే చాలు ఇక…’’ ఇదీ తన లెక్క.! (నిజానికి ఎన్నికలకు ముందే తను కాంగ్రెస్ వైపు వెళ్లే చర్చలు, రాయబారాలు, ప్రతిపాదనలు వేరే కథ...) ఇక్కడ నిజంగా సిగ్గుపడాల్సింది బీజేపీ.! రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎదిగే అవకాశాల్ని చేజేతులా నాశనం చేసుకుంది.! బోలెడు ఎత్తుగడ లోపాలు.!
బీజేపీ తమతో కలిసొస్తుంది..:
అందుకే కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో, రఘునందన్ దుబ్బాకలో, ఈటల హుజూరాబాద్‌లో- గజ్వెల్‌లో, లక్ష్మణ్ ముషీరాబాద్‌లో.. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఓటమి.. ఎంత సతాయించినా సరే మళ్లీ రాజాసింగ్ గెలిచాడు. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపు ఓ చరిత్ర. అంటే జనం స్పష్టంగా బీజేపీ హైకమాండ్‌కు చెబుతున్నారు. ఎవరు పార్టీకి అవసరమో, ఎవరు ఇప్పటికీ నష్టకారకులో.. బీఆర్ఎస్ లీడర్లు బహిరంగంగానే 'బీజేపీ తమతో కలిసొస్తుంది' అని చెబుతున్నారంటే విడ్డూరమే.!
మజ్లిస్, బీజేపీ కలిసి మద్దతునిస్తాయా..? లేదా..?
చూద్దాం గానీ మరి మెజారిటీకి మిగిలిన నంబర్ ఎలా..? ఏముంది..? కాంగ్రెస్ నుంచి లాగేయడమే.! అలవాటైన కూసు విద్యే కదా.! కాంగ్రెస్‌లో లేరా కేసీయార్ కోవర్టులు.! ఈరోజుకూ ఢిల్లీ సంబంధాలతో రేవంత్ చుట్టూ చక్రబంధాన్ని బిగించి, అసలు రేవంత్ సీఎం గాకుండా ప్రయత్నించారు.!
రేవంత్‌రెడ్డికి అనివార్యంగా ఓ సంకేతం
కడియం శ్రీహరి మాటలు, కాంగ్రెస్ సీనియర్లు రేవంత్‌రెడ్డికి అనివార్యంగా ఓ సంకేతం ఇస్తున్నారు. నీ ప్రభుత్వం స్థిరంగా నాలుగురోజులు ఉండాలంటే.. ముందుగా తనదైన ‘బలాన్ని’ సమకూర్చుకోవాలని..! పార్టీలో సీనియర్లు ఎప్పటికైనా ప్రమాదమే… కేసీయార్ ఊరకే కూర్చోడని శ్రీహరి మాటలు చెబుతూనే ఉన్నాయి. సో, బీఆర్ఎస్ నుంచి లేదా బీజేపీ నుంచి. కొందరిని రేవంత్ తనవైపు ఎలాగోలా తెచ్చుకోవాల్సిన అనివార్య స్థితిలోకి తనను నెట్టేస్తున్నారు.!
అదొక అగ్నిపరీక్ష..
ఢిల్లీకి మూటలు తప్పవు, రాబోయే జనరల్ ఎన్నికల ఖర్చు అర్సుకునేది కర్నాటక, తెలంగాణ మాత్రమే.! మరోవైపు పార్టీ ముఖ్యులను మేనేజ్ చేస్తుండాలి. అలవిమాలిన హామీలను అమలు చేయాలి.! అదొక అగ్నిపరీక్ష.. సో, తను పాలనపై దృష్టి పెట్టాలంటే ముందుగా తను ‘పదిలం’ కావాలి. అదే తన ప్రయారిటీ కావాలి. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ సహా తన పార్టీ సీనియర్లు కూడా తనకు పరోక్షంగా అదే చెబుతున్నాయి..!!
బహిరంగ సవాల్
కడియం శ్రీహరి వాఖ్యానాలకు అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరావు బహిరంగ సవాల్ విసిరారు. ఆరు నెలలు కాదు కానీ ఒక ఏడాది సమయం తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
చివరగా…
కడియం కాంగ్రెస్‌ను ఉసిరికాయల మూటగా వర్ణించాడు. అది మాత్రం నిజం.! ఆ మూటను ఎలా బిగిస్తాడో, ఒక్క కాయ కూడా చెదిరిపోకుండా ఎలా కట్టడిలో పెట్టుకుంటాడో రేవంత్.! మొత్తానికి కడియం రేవంత్‌ను భలే అలర్ట్ చేశాడు.!
No comments:
Post a Comment