*_పోస్టల్ బ్యాలెట్ బాక్సుల కలకలం.._*
_* ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత_
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవోకార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తొలగించారని నిరసన చేపట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ సీల్ తొలగించి ఉండటం, అందులో ఉన్న బ్యాలెట్లు లేకపోవడంపై రిటర్నింగ్ అధికారిని నిలదీశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన ఆరు బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాలి. కానీ, ఆరు బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ఉండటంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన తర్వాత పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఆర్డీవో కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన అధికారులు వాటికి సీల్ వేశారు. జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
https://twitter.com/Praja_Snklpm/status/1731023541276180800?t=MiQ5PO3_Spftj7oGA-SHFQ&s=19
No comments:
Post a Comment