Friday, December 8, 2023

కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ దే అక్రమ సంపద 400 కోట్లు.?

KTR OSD Mahender illegal activities


  • కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ దే అక్రమ సంపద 400 కోట్లు.? 
  • కన్ఫమ్మ్డ్ ఐఏఎస్ లిస్టు ప్రిపరేషన్ లో చేయని తప్పులేదు. 
  • ఫైల్స్ క్లియర్ కావాలంటే సొంత పార్టీ వారే  లక్షల్లో చేయితడిపారు.
  • అవినీతికి పాల్పడినట్లు ఎక్కడ కనిపించకుండా మెయింటెన్ చేయడంలో దిట్ట. 
  • పేద బతుకుల జీవన శైలీ, మియాపూర్ లో కాష్ ముట్టిన 15 రోజులకు పని పూర్తి. 
  • బాధితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్స్.
  • పోస్టింగులు కావాలంటే ఆయన సిగ్నల్స్ ఇవ్వాల్సిందే. 
  • మహేందర్ చెప్పితే కేటీఆర్ చెప్పినట్లే అన్నట్లుగా ఉన్నతాధికారుల వ్యవహారం.
  • ఎక్కడ తన పై విచారణ మొదలవుతుందని లూప్ లైన్ లోకి వెళ్లేందుకు అప్లికేషన్.
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో  పవర్ మిస్ యూజ్ కావద్దంటే..
  • మహేందర్ మహిమలు మచ్చుగా బహిర్గతం తెలియాల్సిందే..? 
  • కేటీఆర్ కోటరీలోని అధికారుల అక్రమాస్తుల పై 
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ సాక్షాదారాలతో సహా వరస కథనాలు. 

by

Devender Reddy

9848070809


 ఈనెల 20న ఢిల్లీ లో జరగబోయే కన్ఫమ్మ్డ్ ఐఏఎస్ అధికారుల షాట్ లిస్టు ఇప్పుడు దుమారం లేపుతుంది. దీనికి తోడుగా మొదటి దఫా 5 మంది ఐఏఎస్ లు ఎలా ఎంపిక తీరు కూడా అవినీతికి అద్దం పడుతుంది. రాష్ట్రం నుంచి 3 ఐఏఎస్ అధికారులు, యూపిపిఎస్సీ నుంచి 2 ఐఎఎస్ లు ఇంటర్వ్యూ అధికారులు ఉండటంతో ఈ అక్రమాలకు తావిస్తుంది. కేటీఆర్ ఓఎస్డీ  మహేందర్ అక్రమ ఆస్తులు పై దర్యాప్తు చేయాలని డిమాండ్ పెరుగుతుంది. అల్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లను సైతం అమ్ముకునేంత స్థాయికి ఎదిగారంటే మంత్రుల వద్ద ఉన్నా ఓఎస్డీల వ్యవహారం ఎంత బరితెగింపు ఉందో అర్ధమవుతుంది. ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధుల లిస్టులో అవకాశం ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చి.. వారి నుంచే లక్షల్లో ఖర్చు పెట్టించిన తీరు అశ్చర్యానికి గురి చేస్తుంది. తొమ్మిదేళ్లుగా ఆయన చేసిన తెర చాటు దందాలు ఒక్కొక్కటిగా భయటకు పొక్కడంతో ఆయన ఆదాయానికి మించిన ఆస్తి 400 కోట్లు అని సహా ఉద్యోగులు, ఆ పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్నారు. భయటకు చూస్తే ఆమాయకపు ఫేస్ తో మాచిన బట్టలతో భయటకు కనిపించినా.. ఓ సిక్రెట్ ప్లేస్ వచ్చి.. చెప్పకనే చెప్పుతూ.. మియాపూర్ మెట్రో వద్ద లావాదేవీలు జరిపించడం అలవాటు చేసుకున్నారని నేతలే చెప్పుతున్నారు. ఆయన అక్రమ సంపద పై ల్యాండ్ అండ్ రికార్డ్స్.కామ్ సాక్షాదారాలు సేకరిస్తుంది. ఒక్కొక్కటిగా భయపెటేందుకు సిద్దమవుతుంది. అయితే ఇవ్వన్ని భయటకు పొక్కకుండా లూప్ లైన్ లోకి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ వద్ద అప్లికేషన్ పెట్టుకున్నారు. నేషనల్ ఇన్స్స్టూయ్ ఆఫ్ అర్బన్ మేనేజర్స్ కి బదిలీ కావాలని కోరుతున్నారు. 

ఆయన అక్రమ సంపద ఆపరేషన్ ఇలా ఉంటుంది. 

కేటీఆర్ వద్దకు ఫైల్ పట్టుకొచ్చిన నేతలకు మహేందర్ కి ఇవ్వాలని సూచిస్తారు. రెవెన్యూ పై పెద్దగా పట్టులేని మహేందర్ 4 గురు రిటైర్డ్ ఎమ్మార్వోలతో ఆ ఫైల్ ని పరిశీలిస్తారు. లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లుతారు. దీంతో ఆ ఫైల్ అక్కడే ఆగుతుంది. ఎందుకని పదేపదే అడిగితే కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి దగ్గరగా ఉండే ఓ ప్రాంతానికి మాత్రమే వస్తారు. అక్కడికెళ్లి కలవాలని ఆ నేతలకు చెప్పుతారు. అక్కడ ఎలాంటి మాటలకు మాట్లడకుండా ఉంటాడు. పనితో సంబందం లేదు మీకు డబ్బులు ఎక్కడికి పంపాలో చెప్పండి అంటే చాలు. మియాపూర్ మెట్రో వద్దకి మనుషులను పంపిస్తారు. 15 రోజుల తర్వాత ఫైల్ మంత్రి దగ్గరకు పంపిస్తారు. మీరు మంత్రిగారితో మరోసారి గుర్తు చేయండి అని చెప్పడంతో ఆ సదురు ఎమ్మెల్యేలు మంత్రిగారిని వేడుకుంటారు. దీంతో మహేందర్ ఫైల్ ఎమైంది అంటే.. టేబుల్ పై ఉంది సర్ అంటూ సెలువిస్తారు. ఆయనతో సంబందం లేకపోతే ఆ ఫైల్ ఏడాది అయినా క్లియర్ కాదు. ఇక పండగలు వస్తే.. మున్సిపల్ అధికారులు స్వీట్ డబ్బాలు, టపాకాయలతో క్యూ కట్టాల్సిందే.. లేదంటే.. కిరణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి అందరు వచ్చి మహేందర్ సార్ ని కలుస్తున్నారు మీరెప్పుడు కలుస్తారని అడగటం మాములుగానే ఉంటుంది. దీంతో ఆఫీసర్స్ పండగకు అన్ని సమకూర్చుతారని ఆఫీసర్స్ చెప్పుకుంటున్నారు. 

గత ఇంటర్వ్యూలో తాము అనుకున్న వారికే- ఇప్పుడు ఆయన కోసమే ఫైల్ పెట్టారట. 

జనవరి 24,27 తేదిల్లో ఢిల్లీలో కంఫర్డ్ ఐఎఎస్ ల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. అక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండానే మెరిట్ తో పోస్టింగులు ఉంటాయి. కాని మహేందర్ కావాలని ఓపెన్ క్యాటగిరి తో పాటు ఎస్సీ, ఎస్టీలు అంటూ రిజర్వేషన్స్ పెట్టి ఆ అధికారులతో ఆటలాడుకున్నారు. హైదరాబాద్ లోని ఓ జోనల్ కమిషనర్ తో 10 లక్షల ఖర్చు పెట్టించారు. అందరూ తెలంగాణ భవన్ లో ఉంటే ఈయన ఫ్యామిలీతో ప్రత్యేక హోటల్ లో ఉన్నారు. వారి ప్లైట్ పూణే టూ హైదరాబాద్ 3 రోజులు ఢిల్లీలో ఫ్యామిలీతో ఎంజాయి చేశారు. అయితే ఈ ఖర్చు అంతా ఆ జోనల్ కమిషనరే పెట్టుకున్నారట. తీరా అతనికి ఆశ పుట్టించి.. ఆ ఫోస్ట్ రాకపోవడంతో మరో ప్రధాన ఏరియాలో జోనల్ కమిషనర్ గా రాత్రి రాత్రి పైల్ లో పేరు పెట్టి కేటీఆర్ ని మెప్పించారట. ఒక్కొక్క పోస్టు కి కోటి రూపాయలు అని బేరాసారాలు ఆడారట. అయితే మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన అక్క కూతురు హరిణి కోసం, హరీష్ రావు తన ఓఎస్డీ అశోక్ రెడ్డి కి, కేటీఆర్ తన అడిషనల్ పీఎస్ కాంతాయని కోసం, సీఎం కోటాలో నర్సింహారెడ్డి, మెదక్ చర్చి ఫాదర్ ఫైరవీతో నవీన్ లు ఇక్కడ సీఎస్ తో పాటు మరో ఇద్దరి ఐఎఎస్ లపై ఒత్తిడి తెచ్చి ఎప్పుడు లేని విధంగా కంపర్డ్ ఐఏఎస్ లుగా పోస్టింగులు తెచ్చుకున్నారు.  విజిలెన్స్ ఎంక్వెయిర్ జరుగుతున్న టీఐసీసీ నర్సింహారెడ్డి, శాఖపరమైన చర్యలు ఉన్న పాపయ్య, 2 చార్జీలు ఉన్న నారాయణ రావు, పేర్లతో పాటు  ఏసీబీ ట్రాప్ లో పట్టుపడ్డ హన్మంత్ నాయక్ పేర్లను రిఫర్ చేశారు. ఇక ఎప్పుడు గ్రూప్ -2 అధికారులకు, హైదరాబాద్ లో పని చేసిన సచివాలయం, మంత్రుల ఓస్డీలకు ఈ అవకాశం ఇవ్వరు. కాని కేటీఆర్ అడిషనల్ పిఎస్ కాంతాయని ఎంపీడీవో  నుంచి సైదా సచివాలయం దాటి ఎప్పుడు పని చేయలేదు. ఇలాంటి వారి పేర్లు పంపించిన పాత్రలో మహేందర్ ఎన్నో మహిమలు చూపించారు. తాజాగా 2 పోస్టుల్లో ఒక్క పోస్టు ఆయన కోసమే అంటూ బహిరంగంగానే చెప్పుకుంటూ ఈసారి లిస్టు విచిత్రంగా తయారు చేయించారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే పంకజ పేరును చేర్చారు. అమె గ్రూప్ - 2 అధికారిణే. ఏపికి చెందిన నలుగురు అధికారులను చేర్చడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకులు తలదూర్చలేదు. 

రూల్స్ ప్రకారం ఐఏఎస్ నియామాకాల్లో ఏ నేతలు తలదూర్చలేదు. అక్రమంగా ఐఏఎస్ లు కాలేదు. కాని టీఆర్ఎస్ సర్కార్ లో అంతా ఇష్టానుసారం అయింది. అంతఃపుర ఆస్థానులే అన్ని పంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న అధికారుల బంధువులు ఈ లిస్టులో ఉన్నారు. మెరిట్ ప్రకారం మళ్లీ లిస్టు పంపివ్వడమా..లేదా అందులోనే ప్రతిభవంతులకు మార్కులను బట్టి ఇవ్వడమో.. నిజాయితీగా జరగాల్సిన అవసరం ఉంది. పదవులను, ప్రమోషన్స్ ని ఆశ చూపించి చేయకూడని పనులను చేపించుకుని నాయకులు భారీగా లాభపడ్డారు. కేటీఆర్ కోటరీలో ఉన్న అధికారులు ఎలా సంపాదించారు. వారి బినామిలు ఎవ్వరో రాబోయో కథనంలో సాక్షాధారాలతో సహా మీ ముందు ఉంచబోతుంది లాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్. 

No comments:

Post a Comment