మీడియా మిత్రులకు మనవి.
రేపు రవీంద్ర భారతిలో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అభినందన సభ.
అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘం, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వానికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అనగా 22న రవీంద్ర భారతితో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్. ధనసరి అనసూయ సీతక్కలు విశిష్ట అతిథులుగా హజరౌతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధిలు, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘ రాష్ట్ర, జిల్లా, మండల ప్రతినిధులందరూ విధిగా హజరుకావాలని కోరడం జరుగుతోంది. జన జాగృతి కోసం, తెలంగాణ సమాజం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, నిరంకుశ పాలన నిర్మూలన కోసం ఇంత కాలం పని చేశాం. ఇప్పుడు జర్నలిస్టు సమాజం కోసం ఆలోచించాల్సిన తరుణమొచ్చింది. జర్నలిస్టుల జీవితాలలో వెలుగులు పంచాల్సిన సమయం ఆసన్నమైంది. మనమంతా కలిసి కొట్లాడి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి, కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాపాలన తెచ్చుకున్నాం. అందులో మనమందరం భాగస్వాములౌదాం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరింత శ్రమిద్దాం..ఆ ఫలాలు రేపటి తరానికి అందిద్దాం...ఆ మార్గంలో పయనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరం కలిసి అభినందిద్దాం...మనమందరం ప్రభుత్వానికి తోడుగా వున్నామని మరో సారి నిరూపిద్దాం. మన ఐక్యతను చాటుదాం...జర్నలిస్టు సమూహం, సమాజం కోసం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. వేలాదిగా జర్నలిస్టులు తరలిరండి.
No comments:
Post a Comment