_అంటకాగిన వారి.._
*_తాట తీయబడును.!_*
_■ ఆ పోలీసులపై విచారణ.?_
_■ బీఆర్ఎస్ సహజీవనాకారులపై నజర్.._
_■ గులాబీ ఎమ్మెల్యేల సిఫారసులతో బదిలీలు_
_■ విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ సర్కారు..!_
_■ పోలీస్ శాఖలో త్వరలో భారీగా బదిలీలు_
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_ఓ పిరికోడు 'నియంత'గా మారాడంటే అందుకు కారణం తప్పకుండా.. ఆ అసమర్థుడి వెంట ఓ 'లాఠీ' వ్యవస్థ ఉంటుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ ముఖచిత్రం. ఇప్పుడు 'పెట్టండ్రా అక్రమ కేసులు'.. అంటున్న మిక్కిలినేని నరేంద్ర మాటల్లో ఆవేశం లేదు. ఆవేదనతో కూడిన హెచ్చరిక ఉంది. ఇప్పుడు తెలంగాణ పోలీసులలో 'గత్యంతరం' లేని పరిస్థితుల్లో జర్నలిస్టులను, సమాచారహక్కు బాధ్యులను, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను 'గోస' పెట్టారు. ఇప్పుడు 'ఫలితం' అనుభవించడానికి సిద్దంగా ఉండాల్సిందే.!_*
*https://telanganawatch.in/article.php?data=the-tata-of-those-who-are-stuck-will-be-removed*
*_అసలేం జరిగింది.?_*
తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలతో అంటకాగినట్లు గుర్తించిన కాంగ్రెస్ సర్కారు.. అలాంటి వారిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో 'ఓ సామాజికవర్గానికి ఎక్కువ' ప్రాధాన్యమిచ్చారని, అదే విధంగా అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులతో భారీగా బదిలీలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా.. గులాబీ ఎమ్మెల్యేలు తమకు అనుకూల అధికారులను నియోజకవర్గ పరిధిలో బదిలీలు చేయించుకున్నారు. మరికొందరైతే ఓ మెట్టు పైకెక్కి.. తమవారికి పోస్టింగ్ రాకుంటే.. ఆ స్థానంలో వచ్చిన వారిని బెదిరించి మరీ, బాధ్యతలు తీసుకోకుండా చేశారు.
*_రాష్ట్రం మొత్తం అదే.!_*
జీహెచ్ఎంసీ పరిధిలో ఈ తరహా బదిలీలు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ స్థాయిలో భారీగా ఉన్నట్లు కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. ఇక జిల్లాల్లో అయితే ఎస్సై స్థాయి నుంచి అదనపు ఎస్పీ దాకా ఇలాంటి బదిలీలున్నట్లు భావిస్తోంది.
*_ఎన్నికల సమయంలోనూ.._*
కొందరు అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇతర పార్టీల నేతల ప్రచారపర్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్పట్లో నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఓ చిట్టాను కూడా ఫిర్యాదుతో జత చేశారు. కొందరు అధికారులపై భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) బదిలీ వేటు వేసింది.
*_దటీజ్ రేవంత్..!_*
ఇప్పుడు మిగతా అధికారుల తీరుపై ఉన్నతస్థాయిలో విచారణకు రేవంత్ సర్కారు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విచారణ పూర్తవ్వగానే.. డీజీపీ కార్యాలయం మొదలు.. కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్సీలు, డీఎస్పీ/ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల బదిలీలు భారీగా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రోజున అప్పటి డీజీపీ అంజనీకుమార్, మరో ఇద్దరు అధికారులు కోడ్‌ను ఉల్లంఘించి, రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించడాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఈసీఐ.. డీజీపీని బదిలీ చేసింది. ఏసీబీ చీఫ్‌గా ఉన్న రవిగుప్తాను డీజీపీగా నియమించింది. అదేవిధంగా.. ఎన్నికలకు ముందు హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రం(టీఎ్‌సపీఏ) డైరెక్టర్ సందీప్ శాండిల్యను నియమించింది. ఏసీబీ, టీఎస్ పీఏ పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉంది. ఇవి కాకుండా.. పోలీసు శాఖలో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారు గుర్తించింది.
*_నువ్వు నేర్పిన విద్య నీరజాక్షా...!_*
త్వరలో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో.. అన్ని అంశాలను పరిశీలించి.. పోలీసు శాఖలో బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.
*_కొసమెరుపు_*
నాటి రాజకీయులు చెప్పినట్లు మీం
చేయడం వల్లే కదా. ఈ ప్రభుత్వం వచ్చిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు చెప్పటం గమనార్హం.
*_అంకితం_*
తొలి తెలుగు పరిశోధన పాత్రికేయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఈ కథనం అంకితం.
బాక్స్:
*_వీళ్ళ పరిస్థితి ఏమిటి.?_*
నల్గొండ, ఖమ్మం, ఇల్లందుకుంట, రామకృష్ణాపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని పోలీస్టేషన్ లు భూ దందాలకు నెలవుగా మారాయి. జరగాల్సిన వికృతాలన్నీ జరిగాయి. చేయాల్సిన కిడ్నాప్ డ్రామాలు చేశారు. నల్గొండ 2వ టౌన్ పోలీస్టేషన్ లో ఓ పరిశోధన పాత్రికేయుడి ఫోన్లు 4 గల్లంతయ్యాయి. ఈ కేసు హైకోర్టులో ఉంది. ఇక ఇల్లందుకుంట, రామకృష్ణాపూర్.. పోలీసుల తీరు, అంటకాగిన వైనాలున్నాయి. కేసులు ఎదుర్కొంటున్న వారందరూ పోరాటయోధులు కావడంతో.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారు కీలకమైన పాత్ర కావడంతో నాటి పోలీసుల పరిస్థితి ఏమిటనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ఆరు నెలల్లో ఈ పోలీసులపై తీవ్రమైన చర్యలు తీసుకోలేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధం కావాలని బాధితులు భావిస్తున్నారు.
బాక్స్:
*_ఛీ..ఛీ..ఓనమాలు తెలియనోళ్ళు కూడా..!_*
ఓ ముగ్గురి జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ (సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్) సందర్భంగా డిసిపి స్థాయి అధికారి మొదటి పేజీలో రాసిన కథనం గురించి చెపుతూ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి 'అరెస్ట్' చేశామని చెప్పారు. అయితే ఆ కథనానికి కొనసాగింపుగా 'రెండో పేజీలో ఆధారాలున్నాయి' అంటే అదేలా అంటూ... జర్నలిజం ఎలా ఉండాలో ఓ మూర్ఖపు ప్రసంగం చేయటం గమనార్హం.
No comments:
Post a Comment