Thursday, December 7, 2023

వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలి

పత్రిక ప్రకటన.  07.12.2023

కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిగారికి అభినందనలు

వికలాంగురాలికి మొదటి ఉద్యోగం ఇవ్వడం పట్ల హర్షం

 వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలి

 తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏ రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ అభివందనాలు తెలియజేస్తుంది.
 గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రజలు , వికలాంగుల 
సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాం. గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం పట్ల ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు ఆసరా పెన్షన్లు మాత్రమే ఇచ్చి విద్య, ఉపాధి వంటి మౌలిక అంశాలను వికలాంగులకు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల సంక్షేమం కోసం ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతున్నాం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి క్యాడర్ స్రెంత్ ప్రకారం గుర్తించి భర్తీ చేయాలని, పెన్షన్ 6000కు పెంచుతామనే హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాల్సిన అవసరం ఉంది వికలాంగులపై జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు, వివక్షత అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేసే విధంగా కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలలో భాగంగా మరుగుజ్జు వికలాంగురాలు అయిన రజినికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి ఉద్యోగం రజనీకి అందిస్తూ ముఖ్యమంత్రి సంతకం చేయడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం రాబోయే కాలంలో కూడా వికలాంగుల సంక్షేమం కోసం ఇదే విధమైన కృషి చేస్తారని NPRD ఆశిస్తుంది.

కె వెంకట్
 రాష్ట్ర అధ్యక్షులు

యం అడివయ్య
రాష్ట్ర కార్యదర్శి

అర్ వెంకటేష్
 రాష్ట్ర కోశాధికారి

No comments:

Post a Comment