హైదరాబాద్ : 16/10/2020
*నేటి నుంచి బతుకమ్మ*
*ఇళ్ల వద్దనే పూల పండుగ*
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. తొమ్మిదిరోజుల పాటు (ఈనెల 24 వరకు) ఈ పండుగ జరుగుతుంది. *శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది*. మహిళలు, యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో *తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను* నిర్వహిస్తారు. చివరిరోజు *సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు*. ఈసారి కరోనా, వర్షాల ప్రభావం బతుకమ్మల మీద పడనుంది. ఈ కారణంగా *ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు*. ఇళ్ల వద్దనే పండుగ జరుపుకోవాలని భావిస్తోంది.
*ప్రజా సంకల్పం & link Media ద్వారా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ తొలిరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పరిస్థితుల మధ్య పండుగ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము 🙏*
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment