హైదరాబాద్ : 07/10/2020
*బ్రేకింగ్ న్యూస్*
*రెవెన్యూ సంఘం ప్రతినిధులతో కుత్బుల్లాపూర్ ఎం.ఎల్.ఏ వివేక్ చర్చలు..*
**కుత్బుల్లాపూర్/దుండిగల్ ** వీఆర్వోతో ఫోన్ సంభాషణ విషయంలో నెలకొన్న వివాదం పై కుత్బుల్లాపూర్ గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులతో దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలో చర్చించారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రెవెన్యూ ఉద్యోగులు నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని, ఫోన్ లో మాట్లాడిన అంశాలు ఒకే సారి ప్రజలు వచ్చేసరికి ఆవేశంలో పొరపాటు జరిగిందని ఎవరూ బాధ పడవద్దని అందరికి విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ లక్ష్యాలు సాధించడానికి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంలో కీలకంగా పని చేస్తున్నారని వారితో నాకెప్పుడూ బేదాబిప్రాయాలు లేవని,వీఆర్వో శ్యామ్ కుమార్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మిగతా రెవెన్యూ సోదరులకు ప్రభుత్వ భూముల రక్షణలో పూర్తిగా సహకరిస్తానని, పేద ప్రజల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అయన రెవెన్యూ ఉద్యోగులను కోరారు.ఈ కార్యక్రమంలో *ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఆర్గనైసింగ్ సెక్రటరీ నాగమణి*, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్, ట్రెసా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు,అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, తహసీల్దార్లు మహిపాల్ రెడ్డి, భూపాల్, కోశాధికారి సుధాకర్,విజిలెన్సు కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు ఉస్తాద్, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల కృష్ణమోహన్
No comments:
Post a Comment