Thursday, October 29, 2020

GHMC పరిధిలో GO RT 525 అధికారుల నిర్లక్ష్యంతో అడ్డదారిలో

హైదరాబాద్ : 30/10/2020

GHMC పరిధిలో వరద నీటిముంపు ప్రాంతంలోని ప్రజలకు నష్టం జరిగినందున తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని *GO RT 525* ప్రకారం *అర్హులైన వారికి* నగదు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. అయితే GHMC అధికారులు మాత్రం   సిబ్బందికి GO లోని అంశాలను క్లుప్తంగా వివరించాలి కానీ ఆలా చేయకుండానే నిర్లక్ష్యంగా నగదు పంపిణీకి చేయడానికి పంపించడం జరిగింది. *నేను రామంతాపూర్ డివిజన్ లో ప్రత్యక్షంగా చూసాను* నగదు పంపిణీ స్థానిక *కాలనీ అధ్యక్షుడు* చెప్పిన వారికి GHMC సిబ్బంది ఇవ్వడం.ఆ అధికారిని నేను అడిగాను GO గురించి దానికి అతను మా *సర్* తో మాట్లాడు అని ఇచ్చాడు ఆ *సర్* గారికి కూడా GO గురించి తెలియదు ఇలా వున్నారు GHMC ఉప్పల్ సర్కిల్ అధికారులు. అప్పుడు నేను ఉప్పల్ సర్కిల్ *డిప్యుటీ కమీషనర్ అరుణ కుమారి మేడం* గారితో మాట్లాడాను మరియు స్థానిక మహిళలు కూడా మాట్లాడారు అన్ని వాస్తవ వివరాలు తెలిపారు దానికి *DC మేడం స్పందించి తానే స్వయంగా వస్తాను* అని చెప్పారు కానీ ఈరోజు వరకు రాలేదు.DC మేడం గారికి *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము మీ సర్కిల్ లో *GO RT 525 కి విరుద్ధంగా నగదు పంపిణీ జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది* అది మరిచిపోవద్దు. చట్టపరమైన చర్యలు ఉంటాయి. 

*ప్రతిపక్ష నాయకులారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం GO RT 525 ప్రకారం నగదు పంపిణీ చేయడంలేదు అని దానికి GHMC అధికారులే బాద్యులు అని ప్రెస్ మీట్ పెట్టి బహిరంగా చెప్పగలరా ??? **

బాపట్ల కృష్ణమోహన్ 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment