Tuesday, September 10, 2024

*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు “శ్రీ రేవంత్ రెడ్డి” గారికి బహిరంగలేఖ_*

*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు “శ్రీ రేవంత్ రెడ్డి” గారికి బహిరంగలేఖ_*

*_తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి_*

*_సీనియర్ జర్నలిస్టు “అనంచిన్ని వెంకటేశ్వర రావు” బహిరంగ లేఖ._*

*_తెలంగాణ ఉద్యమానికి చైతన్య గీతికలు జర్నలిస్టులు. మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వారిలో ముందు వరుసలో నిలిచిన వాళ్లే జర్నలిస్టులు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సజీవంగా వుండడానికి ప్రధాన పాత్ర జర్నలిస్టులే._* 

*_రాజకీయ నాయకులు ఏ ఒక్కరూ ముందుకు రాని రోజులలోనే కవులు, కళాకారులు, మేధావుల సభలు, సమావేశాలను అక్షర రూపంలో సజీవం చేసిన వాళ్లు జర్నలిస్టులు. కానీ జర్నలిస్టులెప్పుడూ కూరలో కరివేపాలే అవుతున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఎప్పుడూ అదే జరుగుతోంది. తెలంగాణ జర్నలిస్టులకు అడుగడుగునా అన్యాయం జరుగుతూనే వుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులు పడిన కష్టం, నష్టం దిగమింగుకున్నారు._*

Courtesy / Source by :
*https://netidhatri.com/annam-chinni-venkateshwar-letter-to-cm-revanth-reddy/#google_vignette*

*ఆనాడు ఆకలి కేకలు తెలంగాణ జర్నలిస్టులకు…పెద్ద పీటలు ఆంద్రా జర్నలిస్టులకు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇండ్ల స్థలాలు ఆంద్రా జర్నలిస్టులకే దక్కాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే గతంలో జూబ్లీహిల్స్‌లో జర్నలిస్టు కాలనీలో స్థలాలు పొందిన వాళ్లలో కొందరు మళ్ళీ ఇప్పుడు స్థలాలు పొందారు. అంతే కాకుండా ఇక్కడ స్థలాలు పొందిన అనేక మంది జర్నలిస్టులు ఏపిలో కూడా స్థలాలు తీసుకున్నారు.* 

*ఇక తెలంగాణ వస్తే ఉద్యమకాలానికి చెందిన జర్నలిస్టులకు దక్కిందేమీ లేదు. కనీసం గుర్తింపు కూడా దక్కలేదు. తెలంగాణ వచ్చినా అన్ని వర్గాల అభ్యున్నతి జరిగే వరకు ఉద్యమం సజీవంగానే వుంటుందని అనేక సందర్భాలలో కేసిఆర్ అన్నారు. కాలం కలిసొచ్చి ఆయనే తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో రాసే కలాలలను కాలరాసే పని చేశారు. గొంతెత్తిన జర్నలిస్టులను జైలు పాలు చేశారు. ఆ సమయంలో కూడా ఎలుగెత్తి చాటిన నా లాంటి జర్నలిస్టులున్నారు. కేసిఆర్ ఎన్ని సార్లు జైలు పాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసినా భవిష్యత్తు తెలంగాణ కోసం జీవితమే త్యాగం చేశాము. జీవితంలో అతి ముఖ్యమైన యవ్వన జీవితాన్ని కూడా కొవ్వొత్తిలా తెలంగాణ ఆకాంక్షల కోసం కాల్చుకున్నాము.* 

*ఇప్పుడు తెలంగాణలో ఏపి జర్నలిస్టులకు స్థలాలు పంచుతుంటే మూగనోము పట్టలేము. గుంటూరులో గుంట జాగ అడిగామా? అయ్యోనివా…అవ్వోనివా అని కొట్లాడాము…ఇప్పుడు ఎవరి భూములు ఎవరిస్తున్నారు. తెలంగాణ భూములను ఆంద్రా జర్నలిస్టులకు అప్పగిస్తుంటే గుడ్లప్పగించి చూడమంటారా? ఇప్పటికీ తెలంగాణలో వున్న మీడియా సంస్థలన్నీ ఏపి వాళ్ల చేతుల్లోనే వున్నాయి. వాళ్లు ఇంకా వెయ్యి సంవత్సరాలైనా, తరతరాల సంతతి కూడా జై తెలంగాణ అనరు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో వుంటే వాళ్లకే భజన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వున్న తొమ్మిదిన్నరేళ్లలో ఏ ఒక్క పత్రికైనా, ఛానలైనా సపోర్ట్ చేసిందా? ఆనాడు కాంగ్రెస్ పార్టీకి గొంతుకలుగా, కలాలుగా మారి సిరా చుక్కలు విదిల్చింది మళ్ళీ తెలంగాణ జర్నలిస్టులే.* 


*ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆత్మ గౌరవం వున్న, ఆత్మాభిమానం వున్న తెలంగాణ జర్నలిస్టులే. తెలంగాణ వచ్చినా సీమాంధ్ర యాజమాన్యాల ఆదేశాల వార్తలను వడ్డించలేకనే స్వతంత్ర జర్నలిస్టులుగా మారి, కేసిఆర్ ప్రభుత్వం మీద తిరుగులేని పోరాటం చేశాము. సరిగ్గా ఏడాది క్రితం వరకు కూడా సహకరించని మీడియా సంస్థల ప్రతినిధులకే తొలి ఫలితం దక్కింది. ఇది ఏ సంకేతాలను పంపుతోంది.* 

*ఇప్పటికీ “జర్నలిస్టు సంక్షేమ సంఘంగా” తెలంగాణ జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలన్నదే లక్ష్యం. ప్రజా పాలన రావాలన్న లక్ష్యంతో పని చేసిన సీనియర్ జర్నలిస్టులతో కమిటీలు వేయండి.* 

*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెరువు నిండగానే చేరినట్లు మీ దరి చేరిన వాళ్లెవరూ మీ కోసం పని చేయలేదు. ఎవరు అధికారంలో వుంటే వాళ్ల భజన చేసే వారు చుట్టూ మూగుతున్నారు. వారికి తెలంగాణ ప్రయోజనాలు ఆనాడు పట్టలేదు. ఈనాడు పట్టవు. వాళ్లకు తెలంగాణ వెలుగుకన్నా ఆంద్రజ్యోతులు వెలగాలన్న కాంక్షలతో వుంటారు. వాళ్ల ప్రయోజనాల కోసమే, ఏపి అవసరాల కోసమే పని చేస్తారు.‌ ఇప్పటికీ తెలంగాణ విఫల ప్రయోగమనే దానిని వెలుగులోకి తేవాలనే కాచుకుకూర్చున్నారు. వారి నుంచి రాష్ట్రాన్ని అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాము. ఇంకా తెలంగాణ కోసం జీవితాంతం కాపలాగానే వుంటాము. మాకు పెద్ద పీట వేయకపోయినా ఫరవాలేదు. అవకాశవాదులను దగ్గర చేసుకోకండి. వారి ప్రయోజనాలు పూర్తి చేయకండి.*

*తెలంగాణ జర్నలిస్టులను దూరం చేసుకోకండి.*

ముఖ్యమంత్రిగారూ… మనిద్దరి మధ్య ఉన్న అనుబంధాలు మరో యాభై వసంతాలు సహృద్భావ వాతావర్ణం ఇలాగే కొనసాగాలని అభిలాషించే

మీ
✍️

శ్రేయేభిలాషి
(అనంచిన్ని వెంకటేశ్వరావు,
ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)

No comments:

Post a Comment