Friday, September 13, 2024

*షాద్నగర్ మేధా ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణం.. విద్యార్థినీలపై హాస్టల్ వార్డెన్ అసభ్య ప్రవర్తన*

*మేధా ఇంటర్నేషనల్ స్కూల్‌లో దారుణం.. విద్యార్థినీలపై హాస్టల్ వార్డెన్ అసభ్య ప్రవర్తన*

*స్కూల్ విషయాలు బయటకు చెబితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామని టీచర్లు భయపెడుతున్నారు-స్కూల్ విద్యార్థినిలు*

 *నిరసన తెలుపుతున్న విద్యార్థులకు టి సి ఇచ్చి పంపిస్తామన్న స్కూల్ యాజమాన్యం - స్కూల్ పిల్లలు*

 *ఇలా అయితే మా పిల్లలకు రక్షణ ఎవరు - బాధిత తల్లిదండ్రులు*

షాద్ నగర్:సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇటు స్కూళ్లలో కూడా విద్యార్థినిలు లైగింక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. స్కూళ్లలో విద్యార్థినిలకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ వార్డెన్ పిల్లల పట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. అనేక మంది విద్యార్థినిలు తమకు ఎదురైన పరిస్థితులను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోతున్నారు. దీంతో కామాంధులు మరింత రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని మేధా ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలపై లైగింక వేధింపులకు గురవుతున్నారు. స్కూల్ హాస్టల్ వార్డెన్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, దురుసుగా వ్యవహరిస్తున్నాడని.రాను రాను వీడి ఆగడాలు శృతిమించడంతో ఈ విషయాని విద్యార్థినిలు తన తల్లిదండ్రులకు చెప్పి తమ గోడు వెల్లబోసుకున్నారు . విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.అయితే ఈ ఘటనకు బాధ్యుడైన హాస్టల్ వార్డెన్ రామకృష్ణ మాత్రం పత్తాలేకుండా పోయాడు. ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి పారిపోయాడు. ఈ ఘటనపై షాద్ నగర్ పోలీసులు స్కూల్ వద్దకు చేరుకొని విద్యార్థినిలకు,తల్లిదండ్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఓ పక్క తరచూ చైల్డ్ అబ్యూజ్‌పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమాలు జరుగుతుండగానే స్కూల్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. స్కూల్ వద్దకు చేరుకున్న పలు విద్యార్ధి సంఘాలు ధర్నాకు దిగారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోందని.. ఫీజులపై పెట్టే దృష్టి విద్యార్థుల రక్షణలో లేదు అంటూ విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనల పై పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో జరుగుతున్న విషయాలు బయటకు చెబితే  మీ ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామని అవసరమైతే టీసీ ఇచ్చి స్కూల్ నుంచి బయటకు పంపిస్తామని పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

*ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ వివరణ*

మేధా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సంఘటనపై  ఫరూక్ నగర్ మండల విద్యాధికారి  శంకర్ రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థినీలపై  జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరం పిల్లలు చెప్పినట్లు ఇది నిజమని విచారణలో తేలితే పాఠశాల యాజమాన్యంపై  శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా స్కూల్ యాజమాన్యంను హెచ్చరించడం జరుగుతుందని అన్నారు.

Courtesy / Source by : 
  *జర్నలిస్ట్ మహేష్ భైరమోని*

No comments:

Post a Comment