*విద్యార్థుల్లో స్కిల్ అప్ గ్రేడేషన్ చేసేందుకు కృషి....సీఎం రేవంత్ రెడ్డి....!*
హైదరాబాద్: ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని సీఎం విడుదల చేశారు.తాము చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని స్పష్టం చేశారు. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో యువత ఎదిగేవిధంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
''దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు పీవీ నరసింహారావు కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంతో పోటీపడేలా పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో స్కిల్ అప్‌గ్రెడేషన్ చేయడానికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తాం. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో కూడా మనం రాష్ట్రం ముందుంది. ఐటీ, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. వ్యవసాయం అనేది దండగ కాదు.. పండగ అనేది మా ప్రభుత్వ నినాదం. రూ. 18వేల కోట్ల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు తీర్చాము. తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, ఆర్థిక సాయం అందిస్తాం. మూసీ నది వీక్షణకు పర్యటకులు ఇతర దేశాల నుంచి వచ్చేలా అభివృద్ధి చేస్తాం. దళితులు, గిరిజనలు, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడినట్లు. ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంతో మెరుగుపరుస్తున్నాం'' అని వెల్లడించారు.
Courtesy / Source by :
*V.S. జీవన్*
No comments:
Post a Comment