Monday, September 2, 2024

జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై వారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ, వరద నష్టంపై కేంద్రానికి సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

* పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారిని కోరుతూ లేఖ. తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి.

* వరదల ప్రభావిత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో తక్షణ సహాయంగా 5 కోట్ల రూపాయలు విడుదల.

* మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం.

* చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని నిర్ణయం.

* సహాయ కార్యక్రమాల కోసం ప్రతి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు.

* కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధం చేయడం.

* అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ.

* హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలి. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలి. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.

* సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ @OffDSB, శ్రీ @KomatireddyKVR, సీఎం సలహాదారు శ్రీ @Vemnarenderredy, @TelanganaCS శాంతి కుమారి గారు, @TelanganaDGP జితేందర్ గార్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.#RainAlert #Telangana 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1830514494138724730?t=4vK0vAxTjYSoXiBHCBeptg&s=19

No comments:

Post a Comment