Sunday, October 29, 2023

హ్యాట్రిక్ కొట్టాలని.... చరిత్రలో నిలవాలని... ఎమ్మెల్యేల ఆరాటం

*హ్యాట్రిక్ కొట్టాలని.... చరిత్రలో నిలవాలని... ఎమ్మెల్యేల ఆరాటం*

హైదరాబాద్‌: ఓటర్లను మెప్పించి వరసగా మూడుసార్లు గెలవడం అభ్యర్థులకు పెద్ద సవాలే. సిటీలో కొందరే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. *రాజేంద్రనగర్‌ నుంచి టి.ప్రకాశ్‌గౌడ్‌* *ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆసిఫ్‌నగర్‌ నుంచి దానం నాగేందర్‌* ఇదివరకే హ్యాట్రిక్‌ కొట్టారు.
వీరు ఈసారీ బరిలో ఉండగా మరికొంత మంది హ్యాట్రిక్‌ రేసులో ఉన్నారు.

సనత్‌నగర్‌నుంచి మంత్రి తలసాని 2014లో తెదేపా, 2018లో భారాస నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్‌ సాధిస్తాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్‌లో భారాస తరఫున ఎమ్మెల్యే కేపీ వివేకానంద పోటీచేస్తున్నారు. 2014లో తెదేపా నుంచి తొలిసారి, 2018లో భారాస నుంచి విజయం సాధించారు.
కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు 2014లో తెదేపా, 2018లో భారాస నుంచి విజయం సాధించి తాజాగా అదేపార్టీ తరఫున బరిలో నిలిచారు.
శేరిలింగంపల్లి నుంచి భారాస తరఫున ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హ్యాట్రిక్‌ విజయం కోసం బరిలో దిగారు. 2014లో తెదేపా నుంచి, 2018లో భారాస నుంచి గెలుపొందారు.
జూబ్లీహిల్స్‌ నుంచి భారాస అభ్యర్థిగా గోపీనాథ్‌ 2014లో తెదేపా, 2018లో భారాస తరఫున గెలుపొంది మరోసారి బరిలో నిలిచారు.
చేవెళ్ల నుంచి యాదయ్య 2014లో కాంగ్రెస్‌ నుంచి, 2018లోగెలుపొంది మరోసారి బరిలో నిలిచారు.
చేవెళ్ల నుంచి యాదయ్య 2014లో కాంగ్రెస్‌ నుంచి, 2018లో భారాస తరఫున విజయం సాధించారు. భారాస నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు.
*ఒకే పార్టీ నుంచి..*

సికింద్రాబాద్‌ నుంచి భారాస తరఫున టి.పద్మారావు బరిలో ఉన్నారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి గెలుపొందారు. 2009లో సనత్‌నగర్‌ నుంచి ఓడిపోయినా.. తిరిగి సికింద్రాబాద్‌ నుంచి 2014, 2018లో విజయం సాధించారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు.
పటాన్‌చెరు మహిపాల్‌రెడ్డి భారాస నుంచి 2014, 2018లో గెలుపొందారు. మూడోమారు విజయం కోసం శ్రమిస్తున్నారు.
షాద్‌నగర్‌ నుంచి అంజయ్య యాదవ్‌ హ్యాట్రిక్‌ కోసం బరిలో ఉన్నారు.
గోషామహల్‌ నుంచి భాజపా తరఫున రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ ఖాయమంటున్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment