చెరువుల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
రామంతాపూర్ పెద్దచెరువుతోపాటు ఇతర చెరువుల రక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై వ్యక్తిగతంగా హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖ అధికారులపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది
ఈనాడు, హైదరాబాద్: రామంతాపూర్ పెద్దచెరువుతోపాటు ఇతర చెరువుల రక్షణకు చర్యలు తీసుకోకపోవడంపై వ్యక్తిగతంగా హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు రెవెన్యూ, హెచ్‌ఎండీఏ శాఖ అధికారులపై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రామంతాపూర్ చెరువులో మురుగు కలవకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆదేశించింది. చెరువు పరిరక్షణకు పురపాలకశాఖ ఏం చర్యలు తీసుకుంటుందో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కె.ఎల్.వ్యాస్ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కమిషనర్ రోనాల్డ్‌రాస్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తూ ఆ రోజు కూడా హాజరుకావాలని కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.
No comments:
Post a Comment