అందరికి అన్ని హామీలు ఇస్తున్న నాయకులకు పిల్లలు కనిపిస్తలేరా? బాలల హక్కుల సంఘం
మ్యానిఫెస్టోలో మహిళలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యవసాయదారులకు రకరకాల హామీలు ఇచ్చారు,మరి పిల్లలకు ఏం చేశారు, వారికి ఓటు హక్కు లేదని చిన్న చూపా? వారు ఫ్యూచర్ ఓటు బ్యాంకు అని అన్ని రాజకీయ పార్టీలు గుర్తు పెట్టుకోవాలి.వారి తరపున బాలల హక్కుల సంఘం అడుగుతుంది ఏం చేస్తారు అని? ఈ కార్పోరల్ పనిష్మెంట్స్ లేకుండా, అమ్మాయిలు డ్రాపౌవుట్స్ కాకుండా స్వేచ్ఛగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.ఫీజుల నియంత్రణ పై హామీ ఇవ్వాలి పిల్లల పై రకరకాల అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.కార్పొరేట్ పాఠశాలల నుండి వీధి బడుల వరకు రకరకాల కార్పోరల్ పనిష్మెంట్స్ ఇస్తున్నారు. తెలుగుఅక్షరాలు 56 ఉంటే, అన్ని రకాల పనిష్మెంట్స్ ఇస్తున్నారు కీచక టీచర్స్.తిరిగి ఏమి అనలేని చిన్నారులను హింసించి రాక్షసానందం పొందుతున్న టిచర్లు. ఏం దౌర్భాగ్యమో ఏమో కానీ పిల్లల పట్ల విపరీతమైన ద్వేషం, తప్పులు చేయకున్నా పనిష్మెంట్స్ ఇస్తున్నారు.
- రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఎండలో నిలబెట్టడం.
- చేతులు ఇరవడం
- వాతలు తేలేలా కొట్టడం
- నేలపై అరచేతులతో నడిపించడం
- గోడ కుర్చీ వేయించడం
- రెండు వేళ్ళ మధ్య పెన్సిల్ పెట్టి ట్విస్ట్ చేయడం
- పెన్సిల్ కొనతో అరచేతుల పై కుచ్చడం
- నీల్ డౌన్/ మొకాళ్ళ పై నిలబెట్టడం
- వంగొ బెట్టడం
- బెంచి ఎక్కించడం
- క్లాస్ బయట నిలబెట్టడం
- మానసికంగా హింసించడం అంటే నీకేం రాదు అని, మొద్దువి అని, నీకు చదువు రాదు అని అందరి ముందు హేళన చేయడం
- క్లాస్ మొత్తాం తో ఒకరిని చెంపలు వాయించడం
- అమ్మాయిలను శారీరకంగా హింసించడం.
చైల్డ్ రైట్స్ కమిషన్ వేయాలి ,నేటి బాలలే రేపటి పౌరులు అంటారు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని దేశ రాజకీయనాయకులు మరియు ప్రభుత్వాలు తప్పకుండ ఎంతో కొంత వారి మానసిక శారీరక ఆహ్లాద వాతారణం కల్పించాలి అని బాలల హక్కుల సంఘం కోరుతుంది.
No comments:
Post a Comment