*మోదీ యాక్టింగ్ కు ఆస్కార్ ఖాయం... KTR...!*
ప్రధాని మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుందని మంత్రి కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా బాగా విజయవంతమవుతుందన్నారునిజామాబాద్ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆయన మాట్లాడారని చెప్పారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ఇకపై ఎవరైనా ప్రధాన మంత్రిని కలిస్తే సంభాషణను రికార్డు చేసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.
'' ఎన్డీయేలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకి వచ్చాయి. ఎన్డీయే వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐని పంపుతున్నారు. భాజపాలో చేరిన వారిపై ఉన్న కేసులు మరుగున పడుతున్నాయి. భాజపాలో చేరే నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయి. ఈ 9 ఏళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారు. భాజపా అంటే.. బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా'' అని కేటీఆర్ విమర్శించారు.ఎన్డీయే అనేది మునిగిపోయే నావ, మునిగే నావ ఎక్కాలని ఎవరూ అనుకోరని కేటీఆర్ అన్నారు. '' నన్ను ఆశీర్వదించాలని కేసీఆర్.. మోదీని కోరారట.. నేను సీఎం కావడానికి మోదీ అనుమతి అక్కర్లేదు. 70 ఏళ్ల వయస్సులో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోదీ తగ్గించారు. కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్‌తో కలవరు. వాళ్లతో కలిసేందుకు మాకేమైనా కుక్క కరిచిందా? ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీయే నుంచి బయటకి వచ్చాయి. ప్రస్తుతం ఆ కూటమిలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయి.'' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment