_మాకెలాంటి నిధులూ రాలేదు: న్యూస్ క్లిక్_
*_అందితే తాటి తీసేవాళ్ళు.._*
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_భారత్ వ్యతిరేక ప్రచారం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి భారీ మొత్తాల్లో నిధులు వచ్చాయంటూ దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను న్యూస్ పోర్టల్ ఖండించింది._*
*_అబ్బో... ఇప్పుడు తెలిసిందా..?_*
తమకెలాంటి నిధులూ రాలేదని, దిల్లీ పోలీసులు చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. మీడియా స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరించే కుట్రగా దీన్ని అభివర్ణించింది.
*_అసలేం జరిగిందంటే..?_*
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిపై దిల్లీ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యూస్ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందాయని, కొంత మంది వ్యక్తులతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారని ఎఫ్‌ఐఆర్‌లో దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ తాజాగా వెలుగుచూసిన నేపథ్యంలో న్యూస్‌క్లిక్ పోర్టల్ స్పందించింది.
*_స్పందన ఇదే..!_*
చైనా నుంచి గానీ, ఆ దేశానికి చెందిన సంస్థల నుంచి గానీ తమకు ఎలాంటి నిధులూ అందలేదని న్యూస్‌క్లిక్ ఓ ప్రకటనలో పేర్కొంది. హింసను ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటి చర్యలకు తాము పూర్తిగా వ్యతిరేకమని తెలిపింది. వాస్తవిక అంశాలను అందించడమే తమ ఉద్దేశమని, న్యూస్‌క్లిక్ ఆన్‌లైన్ కవరేజీ చూస్తేనే ఆ విషయం అవగతమవుతుందని తెలిపింది.
No comments:
Post a Comment