*అభ్యర్థుల జాబితా ఖరారుపై కాంగ్రెస్.... చర్చ*
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం దిల్లీలో కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో జాబితాను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపనున్నారు. అనంతరం మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈనెల 14లోపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది.
మరోవైపు, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్ఠానానికి ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు. సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. గత నెల 22న నిర్వహించిన కమిటీ సమావేశంలో దాదాపు 80కుపైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారంనాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదు. ఇవాళ జరిగే సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగిలిపోయిన నియోజకవర్గాలపైన కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు జరగనున్న కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో బస్సు యాత్రపై చర్చించనున్నారు. తెలంగాణలో ఈ నెల 15, 16న ప్రియాంక గాంధీ, 18, 19న రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రూట్ మ్యాప్‌పై చర్చించనున్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment