Monday, November 1, 2021

ప్రభుత్వానికి షాక్‌.. సీఎస్ ఆదేశాల‌పై హైకోర్టు స్టే..!

ప్రభుత్వానికి షాక్‌.. సీఎస్ ఆదేశాల‌పై హైకోర్టు స్టే..!

స‌మాచార అధికారులకు సీఎస్ సోమేష్ కుమార్‌ ఇచ్చిన‌ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారాన్ని అయినా తెలుసుకునేందుకు ప్ర‌జ‌ల‌కు హ‌క్కు ఉంది. కానీ శాఖాధిపతుల అనుమ‌తి లేకుండా స‌మాచారం ఇవ్వొద్ద‌ని గతనెల 13న సీఎస్ అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఆదేశాలు జారీ చేశారు.

సోమేష్ కుమార్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ జ‌రిపింది. ఈ క్ర‌మంలోనే సీఎస్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆదేశాల‌తో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డిన‌ట్లు అయింది

No comments:

Post a Comment