Thursday, November 25, 2021

బస్‌స్టాండ్‌ దుకాణాలపై చలాన్ల కొరడా!

బస్‌స్టాండ్‌ దుకాణాలపై చలాన్ల కొరడా!

  • అధిక ధరలకు అమ్మడంపై ఉన్నతాధికారుల దృష్టి
  • ఇప్పటికే వెయ్యి మందికి జరిమానాలు
  • మూడుసార్లకు మించితే లైసెన్స్‌ రద్దు

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (నమస్తే తెలంగాణ): బస్‌స్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయించే దుకాణదారులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు చలాన్ల కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ వంటి ప్రధాన బస్‌స్టేషన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌స్టేషన్లలోనూ అధికధరలకు అమ్మేవారిపై ఫోకస్‌ పెడుతున్నారు. ప్రధానంగా నకిలీ కంపెనీల వస్తువులు, గడువు తీరిన వస్తువుల అమ్మకం, నాణ్యత, ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించడంపై చర్యలు తీసుకొంటున్నారు. గత రెండునెలల్లో దాదాపు వెయ్యికి పైగా జరిమానాలు విధించినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధలను ఉల్లంఘించే దుకాణదారులకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తున్నారు. వరుసగా మూడుసార్లు అదే తప్పు చేసేవారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధిక ధరలపై ప్రయాణికుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఆయా బస్‌స్టేషన్ల ఉన్నతాధికారులకు లేదా ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

No comments:

Post a Comment