Wednesday, November 3, 2021

IIT Madras Recruitment: మ‌ద్రాస్ ఐఐటీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..

IIT Madras Recruitment: మ‌ద్రాస్ ఐఐటీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..

IIT Madras Recruitment: చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీఎం) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు...

  • Tv9 తెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
IIT Madras Recruitment: మ‌ద్రాస్ ఐఐటీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..

IIT Madras Recruitment: చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్ (ఐఐటీఎం) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా గ్రేడ్‌1, గ్రేడ్ 2 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* మొత్తం 49 ఖాళీల‌కు గాను ఎస్సీ 13, ఎస్టీ 06, ఓబీసీ-ఎన్‌సీఎల్ 25, ఈడ‌బ్ల్యూఎస్ 05 పోస్టులు ఉన్నాయి.

* ఎయిరోస్పేస్‌, అప్లైడ్ మెకానిక్స్‌, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిజైన్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్ విభాగాలున్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌/ బ్రాంచ్‌లో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్‌/ రిసెర్చ్‌/ టీచింగ్‌ అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణకు 02-12-2021 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

No comments:

Post a Comment