Saturday, November 20, 2021

మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే

మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే

  • పద్మ మీనాక్షి
  • బీబీసీ ప్రతినిధి ట్విట్టర్సౌ జన్యంతో 
ఫోన్లో అరుస్తున్న పురుషుడు

మెన్స్ డేనా? "పురుషుల దినోత్సవం" అంటూ ఒకటుందని తెలిసి అవునా అని తల విదిలించుకున్న నెమరులో ప్రసూన్ జోషి గుర్తుకు వస్తాడు మన అరుణ్ సాగర్ కూడా గుర్తుకొస్తాడు ఇలా కవితలా" అంటారు కార్టూనిస్ట్, చిత్రకారుడు అన్వర్.

"నాన్న... మంచి భర్తనిపించుకోవాలి. మంచి తండ్రనిపించుకోవాలి. మగాడనిపించుకోవాలి. కష్టమొస్తే కన్నీళ్లు పెట్టకూడదు. గుండె నిండా దుఃఖపు నిల్వలు పోగేసుకుని ఓ తెల్లారుజామున కుప్పకూలిపోవాలి. నాన్ననెంత కరకు మనిషిని చేశారు" అన్న అరుణ్ సాగర్ మాటలను గుర్తు చేశారు.

నవంబరు 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. దీనిని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 దేశాల్లో జరుపుకుంటారు.

పురుషులకు దినోత్సవం ఎందుకు?

పురుషులు వివిధ రంగాల్లో సాధించిన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ప్రాచుర్యం కల్పించేందుకు ఈ రోజును ప్రముఖంగా నిర్వహిస్తారు. పురుషుల హక్కులు, ఆరోగ్యం, సానుకూల అభిప్రాయాలు, లింగ సమానత్వం సాధించడమే ఈ దినోత్సవ నిర్వహణ ముఖ్యోద్దేశ్యం.

పురుషుల దినోత్సవానికి ప్రతీ ఏడాది ఒక్కొక్క థీమ్‌ను నిర్ణయిస్తారు.

"స్త్రీ పురుషుల మధ్య మెరుగైన సంబంధాల కల్పన" ను ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవ థీమ్‌గా నిర్ణయించారు.

19 November circled

దీని చరిత్ర ఏమిటి? ఎప్పుడు మొదలయింది?

1991లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి ప్రస్తావించి, 1992లో తొలిసారిగా జరుపుకున్నారు. తర్వాత కొంత కాలం పాటు అంతరాయం కలిగింది.

దీనిని తిరిగి ట్రినిడాడ్, టొబాగోలో వెస్ట్ ఇండీస్ యూనివర్సిటీని ఒక చరిత్ర లెక్చరర్ డాక్టర్ జెరోమ్ టీలక్ సింగ్ 1999 నుంచి నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆయన తండ్రి పుట్టిన రోజు కూడా.

1989లో ట్రినిడాడ్ ఫుట్ బాల్ జట్టు ప్రపంచ ఫుట్ బాల్‌ కప్‌‌లో అర్హత సంపాదించేందుకు దేశాన్ని ఐక్యపరిచిన తీరును గుర్తు చేసుకునేందుకు ఈ రోజును పురుషుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి బీబీసీ తగినంత ప్రాచుర్యం కల్పించాలని కోరుతూ డేవ్ బార్లో అనే వ్యక్తి చేంజ్. ఓ‌ఆర్‌జీ‌లో పిటిషిన్ కూడా నమోదు చేశారు.

"ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో మహిళలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఉండగా, పురుషులకెందుకు లేదు" అని అంటూ కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు బెన్ బ్రాడ్లీ ప్రశ్నించారు. గతేడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

కొన్ని వర్గాలకు చేటు కలిగిస్తూ సానుకూల వివక్షను చూపించడం కంటే సమానత్వాన్ని సాధించేందుకు చూడాలని ఆయన కోరారు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవ నిర్వహణకు ఆరు సూత్రాలు

  • స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను మెరుగుపరిచి లింగ సమానత్వాన్ని సాధించడం.
  • సమాజంలో పాజిటివ్ రోల్ మోడల్స్ కు తగినంత ప్రాముఖ్యత కల్పించడం. ఇది కేవలం సినిమా నటులు, క్రీడాకారులకు పరిమితం కాకుండా, సాధారణ వర్కింగ్ క్లాస్ కు చెందిన పురుషులకు కూడా గుర్తింపు ఇవ్వడం.
  • పురుషులు దేశానికి, సమాజానికి, కుటుంబానికి చేసిన సేవలు, వివాహం, పిల్లల పెంపకం, వాతావరణం పట్ల ప్రవర్తించిన తీరుకు ప్రాచుర్యం కల్పించడం. పురుషుల మానసిక, శారీరక ఆధ్యాత్మిక సంక్షేమం పై దృష్టి.
  • కొన్ని సామాజిక సేవా రంగాల్లో పురుషులు ఎదుర్కొంటున్న వివక్షను, సామాజిక వైఖరి, అంచనాలు, చట్టాలకు ప్రాచుర్యం కల్పించడం.
  • జెండర్ సంబంధాలను మెరుగుపరిచి, లింగ సమానత్వాన్ని సాధించడం.
  • ప్రజలు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకునేందుకు తగిన సురక్షితమైన, మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే పనులు చేయడం.

అయితే, ప్రతీ రోజూ పురుషుల దినోత్సవమే కదా అని కొంత మంది విమర్శకులు అంటారు.

మహిళల కోసం ఒక రోజు కేటాయించినప్పుడు, పురుషులకు కూడా ఒక రోజుంటే తప్పేంటి అని రచయత లావణ్య నూకవరపు అంటారు. ఆమె "సిగరెట్స్, సెక్స్, లవ్ " అనే పుస్తక రచయత

లావణ్య నూకవరపు

"పురుషుల దినోత్సవం నాడు పురుషుల గురించి, మహిళల దినోత్సవం నాడు మహిళల గురించి మాట్లాడటం కాదు. సమానత్వం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలను, బంధాన్ని సెలెబ్రేట్ చేసుకోగలగాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా వారు అసంపూర్ణమే. అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే భావనను గౌరవించడమే ఏ రోజు ఉద్దేశ్యమైనా కావాలి" అని అంటారు లావణ్య.

యూకేలో పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక చర్చలు, సమావేశాలు నిర్వహిస్తారు.

ఆధునిక యుగంలో చాలా సంబరాలను, రోజులను క్షేత్ర స్థాయిలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా జరుపుకున్నట్లు కనిపిస్తుంది. ట్విటర్‌లో సోషల్ మీడియా యూజర్లు మహిళా దినోత్సవానికి దొరికినంత ప్రాధాన్యత పురుషుల దినోత్సవానికెందుకు లేదని ప్రశ్నిస్తూ అభినందనలు చెబుతున్నారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Twitterఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 2

పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలను నివారించేందుకు, మానసిక ఆరోగ్య సమస్యలు సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ రోజు ఒక వేదికలా పని చేస్తుందని, ఈ రోజును సమర్ధించేవారంటారు.

45 సంవత్సరాల లోపు పురుషుల మరణాల్లో అత్యధిక శాతం ఆత్మహత్యలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

"మహిళల మనోభావాలను గౌరవించడమే పురుషత్వం. అందుకే, పురుషులు కూడా ఓపికను అలవర్చుకుంటున్నారు. అయితే, పురుషుల సమస్యలను, బాధలను ఎవరూ పట్టించుకోరని, వినరని వారికి కూడా విసుగు పెరుగుతోంది. అబ్బాయిలకు సమస్యలా అని ప్రశ్నిస్తారు. ఈ ధోరణి మారాలి" అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపి ఎమ్ రమేష్ అన్నారు.

  • ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
  • "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
  • పురుషుల దినోత్సవం అవసరమే"

    ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవడం మంచిదేనని కోరాలో కమ్యూనిటీ మేనేజర్‌గా పని చేస్తున్న పవన్ సంతోష్ అంటారు.

    "ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి నిర్ణయించిన థీమ్ ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉంది. పితృస్వామ్య విలువలు మహిళలకు ఎంత చేటు చేస్తాయో, అంతే మొత్తంలో పురుషులకు కూడా చేస్తాయని అంటారు. సమానత్వ సమస్య ఒక్క మహిళలకే పరిమితం కాదు, పురుషులకు కూడా ముఖ్యమే" అని అంటారు.

    భారతదేశంలో పురుషుల దినోత్సవానికి తగినంత ప్రచారం ఇంకా లేదని అంటూ, ఇటువంటి రోజులన్నీ క్రమేపీ వాణిజ్యపరంగా మారిపోతూ ఉంటాయి. అది జరగకుండా చూడాలని పవన్ అన్నారు.

    అబ్బాయిలు కూడా అనేక రకాల సామాజిక మార్పులను ఎదుర్కొంటున్నారు అని చెబుతూ.... .

    "పురుషులకు తమ సమస్యలను ఇతరులతో చెప్పుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. ఉదాహరణకు లైంగికతకు సంబంధించిన సమస్యలు, లేదా ఇతర సమస్యలను తొందరగా ఎవరితోనూ చెప్పుకోవడానికి ఇష్టపడరు. పురుషుల్లో కూడా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి" అని పవన్ అన్నారు.

    "సమాజం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. మనం కూడా మారాలి. సమాజం వ్యక్తి కేంద్రంగా ప్రయాణిస్తోంది. హక్కులు వ్యక్తులకు ముఖ్యమని అంబేద్కర్ చేసిన వాదనను గుర్తు చేశారు.

    బరాక్ ఒబామా

    ఫొటో సోర్స్,GETTY IMAGES

    ఫొటో క్యాప్షన్,

    అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా పలు సందర్భాల్లో బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకునేవారు

    మగవాళ్ళు ఏడవకూడదా?

    "అబ్బాయిలు కన్నీరు కార్చకూడదు, మానసికంగా దృఢంగా ఉండాలని అంటారు. కానీ, అబ్బాయిలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా. భావోద్వేగాలకు జెండర్ లేదు కదా! భావోద్వేగాల తరహాలోనే పితృస్వామ్యం పురుషులపై అనేక రకాల ఒత్తిళ్లను తీసుకొస్తుంది. ఉదాహరణకు భార్య సంపాదనపై ఆధారపడకూడదు, కట్నం తీసుకోవాల్సిందే, ఏడ్చే మగవాళ్ళను నమ్మకూడదా లాంటివి. ఇది వారిపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపిస్తుంది".

    "స్టీరియోటైపు భావనల వల్లే సమాజం ఎగతాళి చేస్తుంది కానీ, దీనికి మరో కారణం లేదు. మహిళలు వంట చేయాలి అనే భావన లాంటిదే ఇది కూడా. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి రచయతలు సమాజం పురుషుల పై పెట్టిన ఒత్తిడిని కూడా 1930-40లలోనే రచించారు" అని పవన్ చెప్పారు.

    గుండమ్మ కథ నుంచి ఆనంద్ వరకూ"

    "గుండమ్మ కథలో ఒక భార్య ఎలా ఉండాలనే స్థితి నుంచి 2006లో ఆనంద్ లాంటి సినిమాలో మహిళకు చూపించిన ఆర్ధిక స్వాతంత్య్రం వరకూ సమాజం ప్రయాణించింది. ఆ సినిమాలో భార్యను భర్త మార్చుకున్న విధానాన్ని, పురుషుడు ఎలాంటి వాడైనా స్త్రీ ఆమోదించే పరిస్థితి నుంచి "నీ చేతిలో నా జీవితాన్ని నాశనం చేసుకునే కంటే నా చేతిలో నా జీవితం నాశనం అయినా పర్వాలేదు" అని ఆనంద్ సినిమాలో స్త్రీ పాత్ర మాట్లాడే మాటల వరకూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ప్రయాణించారు. ఈ మార్పును అర్ధం చేసుకోవడం స్త్రీ పురుషులకు ఇద్దరికీ అవసరమే".

    "ఈ సామాజిక పరిణామాన్ని అందుకునేందుకు పురుషులు కూడా ప్రయాణిస్తున్నారు. ఇదే వాస్తవం" అని పవన్ అన్నారు.

    భావన నిస్సిమ

    ఫొటో సోర్స్,BHAVANA NISSIMA

    ఫొటో క్యాప్షన్,

    భావన నిస్సిమ

    "పురుషులకు కూడా సమస్యలా?"

    పితృస్వామ్యం పురుషుల సంక్షేమానికి కూడా ఆటంకం కలిగిస్తుందని చాలా మంది పురుషులు గ్రహిస్తున్నారని రచయత, ఎన్‌ఎల్‌పి ఎడ్యుకేటర్, వెల్‌నెస్ కోచ్ భావన నిస్సిమ అంటారు.

    "పురుషులకు కూడా సమస్యలుంటాయి. ఒకసారి నా సోదరుడే నన్ను తన సమస్యలతో సంప్రదించారు. నా దగ్గరకు అనేక మంది పురుషులు రక రకాల సమస్యల పరిష్కారానికి వస్తూ ఉంటారు. వారికి కూడా సమస్యలుంటాయని మహిళలు గ్రహించాలి" అని భావన అంటారు.

    "ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం స్త్రీ పురుషులిద్దరూ కలిసి పని చేయాలని మహిళలు కూడా గుర్తిస్తున్నారు. ఇదే సమానత్వం సాధించేందుకు ముందడుగు" అని భావన అన్నారు.

    సోషల్ మీడియా ఆవిర్భావంతో, ఇలాంటి దినోత్సవాలకు మరింత ప్రాచుర్యం లభిస్తోంది. నేను మాట్లాడిన కొంత మంది వ్యక్తులు అలాంటి రోజొకటి ఉంటుందా అనే ప్రశ్నను కూడా వ్యక్తం చేశారు. దీనిని బట్టీ చూస్తుంటే, పురుషుల దినోత్సవానికి మహిళా దినోత్సవానికి లభించినంత ప్రాచుర్యం దక్కలేదని అర్ధమవుతోంది.

    "పురుషులు కూడా సంరక్షకులుగా ఉంటూ ఇంటిపనుల్లో సహాయం చేయాలి. స్త్రీ పురుషుల మధ్యనున్న మధ్య ఉన్న తేడాలను ఆమోదించగలగాలి" అని థియేటర్ కళాకారుడు, ఆటిజమ్ అండ్ ఆర్ట్స్ ప్రచారకులు రామమూర్తి పరాసుర అన్నారు.

    "మహిళల మనోభావాలను గౌరవించడమే పురుషత్వం. అందుకే, పురుషులు కూడా ఓపికను అలవర్చుకుంటున్నారు. అయితే, పురుషుల సమస్యలను, బాధలను ఎవరూ పట్టించుకోరని, వినరని వారికి విసుగు కూడా పెరుగుతోంది. అబ్బాయిలకు సమస్యలా అని ప్రశ్నిస్తారు. ఈ ధోరణి మారాలి" అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపి ఎమ్ రమేష్ అన్నారు.

మగాడొక ఒంటరి పర్వతం"

"మెన్స్ డేనా? మగాళ్ళమని చివరి స్పృహ కలిగిన తారీకు ఏదని వెతుక్కుంటాం " నువ్వు మగోడివే అయితే రెండు నిముషాల్లో ఎన్‌జి‌ఓ కాలనీ పోస్ట్ డబ్బాని అంటేసుకుని రావాలి" అని బడి మిత్రుడి డిమాండ్లోనో, నువ్వు మగోడీవే అయితే బద్దిలో ఉన్న గోలీ గుండ్లల్లో పచ్చ రంగు గోలీనే కొట్టాలి" అనే సవాల్‌ను ఛేదించడంలోనే ముగిసిపోయింది" అని మెన్స్ డే గురించి మాట్లాడుతూ అన్వర్ అంటారు.

"తాగుబోతో తిరుగుబోతో క్రూరఘోర కర్కోటకుడో, రంగనాయకమ్మ బుచ్చిబాబో యద్ధనపూడి ఆజానుబాహుడో ప్రేమికుడో కాముకుడో స్వాప్నికుడో కుటుంబరావో ఎవడైతేనేం మగాడొక ఒంటరి పర్వతం. ఒంటరి చెట్టు. ఒంటరి ద్వీపం. ఒంటరి గీతం. కన్నీరు నిషిద్ధం. కేవలం హృదయవిస్ఫోటం. మీరు మమ్మల్ని కొలవలేరు" అని అరుణ్ సాగర్ కవిత్వంతో సంభాషణను ముగించారు.

No comments:

Post a Comment